పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సాహిత్యరత్నాకరే—


ప్రకృత్యాయగణోనిత్యం శ్రీకరః కధ్యతే బుధైః
సఏవ వికృతిం యాతి సగణోనుగతో యది.

42[1]


ఆంధ్రభాషాయాం-
గోకర్ణఛందసి—


క.

సయలం జెప్పిన శుభ మగు
జయలం జెప్పినను బతికి జయకీర్తులగున్
రయలం జెప్పిన నెంతయుఁ
బ్రియ మగు మఱి మయలఁ జెప్ప బెంపొనరించున్.

43[2]


ఉత్తమగండ ఛందసి—


క.

సభఁ జెప్పిన విభవంబగు
రభసంబునఁ జెప్ప చేటు రయలం జెప్పన్
శుభమగు నయలం జెప్పిన
నుభయము వర్ధిల్లునందు రుత్తమగండా!

44[3]

3. శ్రీరగణస్య

వాదాంగచూడామణి—


చ.

జ్వలనుఁ డధీనుఁ డాకులము క్షత్రియ మప్పవడంబుకాంతి పెం
పలర గ్రహంబు భూతనయుఁ డాతఁడ రక్తపువన్నె పానకా
ఖ్యలలితతార దైత్యగణ మయ్యజయోనియు మేషరాశి యా
ఫలము భయప్రదంబు రగణంబునకున్ ద్రిదశేంద్రవందితా!

45[4]
  1. ఆ.రం.ఛం. అ 2 ప 25
  2. ఆ.రం.ఛం. అ 2 ప 26. సు.సా. 317 ప. తాళపత్రప్రతిలో నయలం అని ప్రారంభించుచుండగా పైపుస్తకముల ననుసరించి సయలం అని మార్చితిని.
  3. సు.సా. 318 ప. ఇది భిన్నముగా నున్నది.
  4. ఆ.రం.ఛం. అ 2 ప 30