పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆదిపర్వాణ్యాదౌ శబ్దశాసనేనోక్తం—


‘శ్రీవాణీగిరిజాశ్చిరాయదధత’ ఇతి

38[1]


ఏవం మగణ లక్షణం

2. అధ యగణస్య

వాదాంగచూడామణి—


చ.

జల మధిదైవమున్ రజితసన్నిభకాంతి కులంబు విప్రుఁడున్
ఫలము ధనంబు తద్గ్రహము భార్గవుఁ డాతనివర్ణ మెన్నఁగా
దెలుపు జలంబు ధారకము తెల్లముగా ధనురాశి యోనియున్
బలుముఖ మగ్గణంబునునౌ యగణంబు కీశ్వరా!

39[2]


కవిసర్పగారుడే—


మ.

అలరన్ దైవము వారి బ్రాహ్మ్యము కులంబా వన్నె తె ల్పర్థమా
ఫలమా, యోని ప్లవంగ మాగణము చెప్పన్ వానరం బాగ్రహం
బలశుక్రుండు రసంబు దాఁ గరుణ పూర్వాషాఢ నక్షత్ర మి
మ్ములఁ గోదండము రాశినా యగణ మొప్పున్ గోవిదస్తుత్యమై.

40[3]


టీక.

ఉదక మధిదేవత, వర్ణం తెలుపు, కులం బ్రాహ్మం, ఫలం
ధనం, గ్రహం శుక్రుడు, నక్షత్రం పూర్వాషాఢ, ధనూ రాశి,
వానర యోని, మనుష్య యోని, కరుణ రసం, అగ్ని వైశ్య
గోత్రం, జననం విజయనామయామం రెండో జామున.


ఆదిప్రయోగసరణి—


చమత్కారచంద్రికాయాం—


కరోత్యర్థానాదిలఘు ర్యగణోవారి దైవతమ్.

41[4]
  1. ఆ.రం.ఛం. అ 2 సం 17
  2. ఆ.రం.ఛం. అ 2 సం 22. తాళపత్రప్రతిలో భేదముగా నుండుటయే గాక, ఆఖరుచరణములో గణములుకూడ తగ్గినవి. కాన సంస్కరించితిని.
  3. ఆ.రం.ఛం. అ 2 సం 13. సు.సా.లో 251వది
  4. ఆ.రం.ఛం. అ 2 సం 24