పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవిరాజగజాంకుశే—


క.

మగణంబు పద్యముఖమున
సగణముతోఁ గూర్చి చెప్పజనుఁ గృతి యెందున్
దగఁ బద్యమందుఁ గర్తకు
నగణితముగ నర్థసిద్ధులగు సత్యముగన్.

34[1]


కావ్యచింతామణి-తాతంబట్లు—


క.

జగతిన్ గణములకెల్లను
మగణము కారణముగాన మగణము గదియ
న్నిగురించు గణము లెల్లను
దగ శుభ మొనరించు సెడు తగులదు దానన్.

35[2]


ఉత్తమగండఛందసి—


క.

రసలం జెప్పిన శుభమగు
జసలం జెప్పినను జయము సయ్యన వచ్చున్
నసలం జెప్పిన మేలగు
మసలం జెప్పిననుఁ గర్పమండల మేలున్.

36[3]


మగణ, సగణ ప్రయోగస్య లక్షణం—


రఘువంశే కాళిదాసోక్తం—


‘వాగర్థావివసం పృక్తౌ’ ఇతి

37[4]
  1. ఆ.రం.ఛం అ 2 ప 14; కాని ఇది శ్రీధరుని ఛందస్సులోనిదని జెప్పఁబడినది.
  2. ఆ.రం.ఛం అ 2 ప 15. సు.సా.లో 291 ప
  3. సు.సా. 316వ పద్యమునకును, దీనికినిఁ జాల భేదము గలదు. అచ్చట భీమన కర్తగాఁ జెప్పబడినాఁడు.
  4. ఆ.రం.ఛం అ 2 సం 17