పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాశ్యపస గోత్రం, జననం జయనామ యామలో మొదటిజామున. భీమన మతం గ్రహం కుజుఁ డన్నాఁడు. అంటే నేమి? ‘బహునా మనుగ్రహార్యాయ’ ప్రమాణమని యెరింగితి.


ప్రయోగసరణికి గణయోగఫలాలు


చమత్కారచంద్రికాయాం—


శ్లో.

క్షేమంసర్వగురుర్దత్తే మగణోభూమి దైవతః

30[1]


సాహిత్యచంద్రోదయే—


శ్లో.

సౌమ్యోపి మగణః క్రూరః క్రూరమ్ గణ ముపాశ్రితః
క్రూరగ్రహ సమాయుక్త శ్శత్రుదేశే బుధోయథా
నరపతిః బుధః పాపయుతః పాపీక్షీణచంద్రోఽన్యధామతః.

31[2]


శ్రీధరఛందసి—


క.

మగణం బెప్పుడు శుభకర
మగు, నైనను గ్రూరగణము నది డాసినచో
దెగి చంపు, బుధుఁడు క్రూరుం
డగుగ్రహమును గదిసి క్రూరుఁడై చనుమాడ్కిన్.

32[3]


అలంకారచూడామణి—


శ్లో.

కర్తుః కారయితుశ్చైన మగణోబుధకర్తృకః
సగణేన సమాయుక్త సర్వకాలఫలప్రదః.

33[4]
  1. ఆ.రం.ఛం. అ 2 సం 10
  2. ఆ.రం.ఛం. అ 2 , సం 11 తాళపత్రప్రతిలో నరపతి యను పదసంపుటి యధికముగాఁ గలదు.
  3. ఆ.రం.ఛం. అ 2 ప 12 సు.సా.లో 296 పద్యము. ఇది భీమనఛందములోనిది యని జెప్పఁబడినది.
  4. ఆ.రం.ఛం. అ 2 సం 13