పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవిసర్పగారుడే—


మ.

ధర దైవంబు గ్రహంబు సౌమ్యుఁడు హరిద్వర్గంబు దత్కాంతియా
సుర మూహింప గణంబు జాతి దలపించున్ శౌద్రియా యోనిదా
హరిణం బుజ్జ్వలతార జ్యేష్ఠరస ముద్యద్రౌద్రమారాశి తే
లు భద్రంబు ఫలంబు నామగణ మింపొందున్ బుధస్తుత్యమై.

27[1]


ఉత్తమగంఢ ఛందసి—


క.

దరణిజ శశిరవి బుధగురు
సురరిపు గురుమందఫణులు సొరిది గ్రహంబుల్
పొరి మ భ జ స న య ర త గణ
సరణికి ఛందోమతంబు చర్చింపంగన్.

28[2]


గోకర్ణఛందసి—


గీ.

కాశ్యపాత్రిపైశ్యకౌశికగౌతమ
యల వసిష్ఠభార్గవాంగిరసులు
మహితగోత్రఋషులు మ య ర స త భ జ న
తిట్లు నెనిమిదిగణముల కెన్నఁబడును.

29[3]


టీక.

ఫలం భద్రం, రాశి వృశ్చికం, హరిణ యోని, హరి ద్వర్ణం,
జ్యేష్ఠా నక్షత్రం, గ్రహం బుధుం డితఁడు సువర్ణఛాయ,
శూద్ర జాతి, రౌద్ర రసం, దైత్య గణం, అధిదేవత భూమి,

  1. ఆ.రం.ఛం. అ 2 ప 9
  2. ఇది భీమనకృతమని కవిజనాశ్రయములోఁ జేర్చబడినది. ఆంధ్రసాహిత్యపరిెషత్తువారి కవిజనాశ్రయము. సంజ్ఞా ప 27
  3. తాటాకుప్రతిలో మహితగోత్ర ఋషులు మయరసతబ్రభలు కిట్లన గణమునకు నెన్నబడదు అని తప్పుగా నుండగా బైనఁజెప్పిన విధముగా సవరించితిని. కొంత పోలికతో నీపద్యము అం.సా.ప.వారు కవిజ సంజ్ఞా 29 ప గా నున్నది.