పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు.[1]


వీనికి నుదాహరణములు——


సీ.

కమలనాభానగఁ గంబు; కమరరూప
                       ననా, మనురాంతకనాఁగసలల
మద్రిధరభలంబు, భద్రయశాయన్న
                       భగురు, వంభోజాక్ష మగణలఘువు
భువనేశ్వరాయన్నసవ, మఘవిద్వంస
                       సహము, పీతాంబరసంజ్ఞ తలము,
కైటభారి రలంబు; గజవరదా యన్న
                       నవ, మహిశయననా నలలమయ్యె


ఆ.

రగణగురువు దేవరాజాయనంగఁ బ
ద్మాపతీ యనంగ దగణగురువు,
నరహరీ యనంగ నరహరి నరసింహ
నాఁగ నొప్పు నగము నలము సలము.

25[2]

7. మగణాది గణలక్షణాలు

మగణస్య

వాదాంగచూడామణి—


చ.

పరగ ధరాధిదైవతము, పచ్చనికాంతియు శూద్రజాతియున్
నరయ బుధుండు తద్గ్రహము, హాటకవర్ణ మతండు, తత్ఫలం
బురుశుభ, మెన్నగా హరిణయోనియు, వృశ్చికరాశి, నిర్జరే
శ్వర వరతారదైత్యగణ సంగతమున్ మగణంబు శంకరా!

26[3]
  1. ఈ మూడురకముల గణములు వరుసగాఁ జెప్పఁబడినవి. అనవసరమని కాపీచేయఁబడలేదు.
  2. అనంతుని ఛందము అ1 ప 17
  3. ఆ.రం.ఛం. అ 2 ప 8. సు.సా.లో 250 ప