పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇంక ప్రధానగణాలకు—
మగణం UUU
యగణం ।UU
రగణం U।U
తగణం UU।
జగణం ।U।
భగణం U।।
సగణం ।।U
నగణం ।।।

6. ఇంక అక్కరజాతులకు వచ్చేగణాలకు ప్రస్తారము

అనంత ఛందస్సు—


క.

చాలుగను స్వరగురులిడి
లాలితముగ గురువుక్రింద లఘువు వెలుపలన్
ఓలి సమంబును దాపలి
వ్రాలునకు గురువుల నిలుపఁ బ్రస్తారమగున్.

22[1]


క.

ద్విత్రి చతుర్గురు భవముల
ధాత్రీధవ! రెండుదక్క తక్కినగణముల్
మిత్రేంద్రచంద్రు లనఁదగు
మాత్రాదిగణంబు మొదలమాత్ర నిలుపగన్.

23[2]


ఇందుకు టీక[3] (—)
ఇందుకు పద్యము——


క.

గల, నగణము లినుఁడింద్రుఁడు
నల,నగ,సల,భర,త; లింక నగగ,సవ,సలా
భల,భగురు,మలఘు,సవ,సహ
తల,రల,నవ,నలల,రగురు, తగ నిందుఁ డజా!

24[4]
  1. ఇది అచ్చుపడ్డ సులక్షణసారములో లేదు. ఆ.రం.ఛం. అ 1 ప 55.
  2. అనంతుని ఛందోదర్పణము అ 1 ప 18. సు.సా.లో ప 30
  3. కొన్ని యక్షరములు బొత్తిగాఁ దెలియుటలేదు. కాన కాపీ చేయబడలేదు.
  4. ఇది కూడ అనంతుని ఛందములోనిదె. సు.సా.లో ప 21