పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మొదల నడుమఁ దుదిఁ లఘువులు
వదలవు యరతలకు, వానివరుసనె భజసల్
విదితంబులు గురువులు తా
మొదలనడుమ మసలకెసఁగు మొగి గురులఘువుల్.

18


విన్నకోట పెద్దిరాజు—


క.

గురులఘువులు గలమగు; లఘు
గురులు, గురులఘువులు నెన్నికొన నహములగున్
గురులఘువులు త్రితయములై
మురువునవి మగణ నగణము లనగఁ బరగున్.

19[1]


ఆ.

మగణరచన నాది మధ్యాంతలఘువులు
గలిగెనేని యరత గణములయ్యె
నగణరచన మొదల నడుమను మఱి గుర్వు
లుండెనేని భ జ స లొప్పుమిగులు.

20[2]

5. ఫలితార్థము

క.

గల గురులఘువులవియె మ
నలకు తటభయల కాది నడుమచేర బకా
వలన తలకు కడముఖముల
నిల హపలకు నిల్పు గణములన్నియు రామా!

21[3]


గణాలు కల్పించే విధము—
గ ఇది గురువు. ఇవి రెండైతే గా గణం.
ల ఇవి రెండైతే లలం.
వగణం ।U. ఇది లగ మనిపించికొనును. హగణం U। ఇదె గల మనిపించికొనును.

  1. విన్నకోట పెద్దిరాజు కావ్యాలంకారచూడామణి ఉ 7 ప19
  2. కా.చూ. ఉ 7 ప 20
  3. ఇది తప్పులపద్యము. కాని రామసంబుద్ధిచేత లింగమకుంట తిమ్మకవికృత మని రుజువగుచున్నది.