పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అది గాన తల్లిదండ్రుల
కొదువదు వైరమ్మటంచు నొనరఁగ సుకవుల్‌
కొదుకక బంధుగణంబుల
గదియంతురు రసలుదక్కఁ గావ్యముఖములన్‌.

15[1]


కవిసర్పగారుడే—


సీ.

జయవిజయంబులు శంఖమహా
                       శంఖము లనంగఁ బగటిజా ల్వెలయుచుండు
రాత్రి జిత్రామయై రామసుప్తప్రసు
                       ప్తంబులు ననియునుం బరగుచుండు
నీ యెనిమిది జాలఁ బాయక మగణాది
                       గా జనించె గణాష్టకంబు వరుస
నేజామునను గావ్యుఁ డెలమి గబ్బంబును
                       విదళింపఁబూను నవ్వేళయందు


తే.

నుద్భవంబైనగణము ప్రయోగమునకు
శుద్ధిగాఁ గూర్ప కురక విజ్జోడుపడఁగ
గణము లూహించి కూర్చు వికారికుకవి
పద్య మొల్లఁడు బ్రతుకాశపడఁడు వాఁడు.

16[2]

4. గణానాం గురులఘుసంజ్ఞా

వృత్తరత్నాకరే—


ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్
భజసాం గౌరవంయాంతి మనౌతు గురులాఘవమ్.

17[3]


ఆంధ్రభాషాయాం-గోకర్ణచ్ఛందసి—

  1. సు.సా.లో 249వది.
  2. సు.సా.లో 261వది. ఆ.రం.ఛం.లో అ 1 ప 15. 'లిగారి' అనిగాక 'లిగాడి' (= వెనుకఁబడినవాఁడు) అను నర్థము తూర్పుగోదావరిజిల్లాలో వాడుకలో గలదు.
  3. ఆ.రం.ఛం.లో అ 1 శ్లో. 30