పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవిరాజగజాంకుశే—


క.

ఒనరఁగ మ,య,ర,స,త, భ,జ,న
లన నివి యెనిమిది గణంబులని సత్కృపతో
నెనసిన మతిఁ బింగళునకు
మనసిజ(తను)మథనుఁ డాగమంబులఁ దెలిపెన్‌.

10[1]

3.గణోత్పత్తి

చమత్కారచంద్రికాయామ్—


శ్లో.

మయరసతభజన సంజ్ఞాః ప్రసూతాః

11


ఆంధ్రభాషాయామ్—ఉత్తమగండ ఛందసి—


ఆ.

చంద్రసూర్యవహ్ని చక్షుఁడౌ రుద్రుని
మూఁడుకన్నులందు మూఁడుగురువు
లుదయమయ్యె దాన నొప్పారె మగణంబు
అందు సప్తగణము లవతరించె.

12[2]


కావ్యచింతామణి—తాతంభట్టు—


క.

మగణమువలనన్‌ యగణము
యగణమువలనన్‌ జనించె నా రగణమ్మా
రగణమువలనన్‌ సగణము
సగణంబునను తగణంబు జననంబయ్యెన్‌.

13[3]


క.

తావలన జగణ మయ్యెన్‌
జావలనన్ భగణమయ్యె ఛందోగతి నా
భావలన నగణ మయ్యెను
భావింపఁగ జనకజన్యభావము గాఁగన్‌.

14[4]
  1. సులక్షణసారములో 246వ పద్యము.
  2. సు.సా.లో 245వ పద్యము. - ఇది భీమకవికృత మని ఇతరపుస్తకములలోఁ జెప్పబడినది పొరపా టనవచ్చును.
  3. సు.సా.లో 247వది.
  4. సు.సా.లో 248వది.