పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

“గ్రంథసామగ్రి గలుగుటఁ బ్రతిపదమున
కన్ని లక్షణములు వ్రాయుఁ” డనిన నందు
గ్రంథవిస్తార మగుఁ గానఁ గవిత సూక్ష్మ
మెన్నిటను బొందుపడు నన్నియే రచింతు.

5

1. అవతారిక

సాహిత్యరత్నాకరే—


శ్లో.

ఛందోజ్ఞానమిదం పురాత్రిణయనాల్లేభే శుభం నందిరాట్
తస్మాత్ప్రాప సనత్కుమారక? స్తతోఽగస్త్యస్తతో వాక్పతి
తస్మాద్దేవపతిస్తతః ఫణిపతి స్తస్యానుజః పింగళ
స్తచ్ఛిష్యైర్మునిభిర్మహాత్మభిరిదం భూమౌ ప్రతిష్ఠాపితమ్.

6[1]


ఆంధ్రభాషాయామ్ అథర్వణఛందసే—


ఆ.

ఇందుమౌళివలన నందిగాంచిన ఛంద
మెలమిఁ జదివి రొకరివలన నొకరు
లలి సనత్కుమార కలశజ జీవ వృ
త్రారి శేష పింగళాఖ్యు లోలి.

7[2]


అథాధావసే (?)—


క.

గంగాధర విపులకృపా
పాంగ సుధాహరుని నిద్ధపావనదేహున్
పింగళనాగేంద్రుని ముని
పుంగవసన్నుతుని సుకవిపూజ్యునిఁ దలఁతున్.

8

2. గణసంఖ్యా

కవికంఠపాశే—


శ్లో.

తతోమ్యారస్తభ జ్నాభ్యాగణాస్సు(స్తేసు)ప్రకీర్తితాః

9
  1. ఆనందరంగరాచ్ఛందములో 22వ పద్యమునకు పిమ్మట నున్నది.
  2. ఆ.రం.ఛం.లో అ 1 ప 23