పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆంధ్రభాషాయామ్-
శ్రీధర ఛందసి—


క.

పొగడందు పద్యముఖమున
రగణము యగణంబు గూడి రాగిల్లిన నీ
జగమంతయు నేలెడివాఁ
డగుఁ గృతిపతి విభవయుక్తుఁ డగుఁ గవివరుఁడున్.

50[1]


రగణ సగణ యోగఫలవిశేషం


సాహిత్యచంద్రోదయే—


అనలానిలసంయోగం కరోతి విభుమందిరే
మహానలభయం తత్రభీమ జ్వాలా సమాకులమ్.

51[2]


కవికంఠపాశే—


మారుత పూర్వే వహ్నౌవహ్ని
భయం శుభోయుతోన్యేషామ్.

52[3]


ఆంధ్రభాషాయామ్-
అసిధర్వణఛంద—


క.

అనలానిలసంయోగం
బనుపమకీలాకరాళ మగు వహ్నిభయం
బొనరించుఁ గర్తృగృహమున
ననుమానము లేదు దీన నండ్రు గవీంద్రుల్.

53[4]
  1. ఇది అధర్వణునిదని ఆ.రం.ఛం. అ 2. ప 34లో చెప్పనుంజి సు.సా.లో 298 ప.
  2. ఆ.రం.ఛం. అ 2. సం 36
  3. ఆ.రం.ఛం. అ 2. సం 38
  4. ఆ.రం.ఛం. అ 2. ప 40. సు.సా.లో 300 ప.