పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సులక్షణసారమునుండియే అధోజ్ఞాపికలలో నెల్లెడలనుఁ బద్యసంఖ్యలఁ జూపినాను.

లింగమగుంట తిమ్మకవి కవిపండితవంశమునకుఁ జెందినవాడు. నెల్లూరు జిల్లాలోని గుండ్లకమ్మ (కుండికానది)యేటితీరమున లింగమగుంట గ్రామమున్నది. ఇందు వసించుటచే లింగమగుంట యింటిపేరైనది. వీరివంశవృక్షము —

(రామకవి వ్రాసిన చతుర్వాటికామాహాత్మ్యములోని తిమ్మకవి వ్రాసిన సులక్షణసారములోని వంశవర్ణన పద్యములనుండి పైవంశవృక్షము వాయఁబడినది. రెండు పుస్తకములలోఁ జెప్పఁబడినవానిలో స్వల్పభేదములు లేకపోలేదు. రామకవి తన తండ్రిపేరు,