పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షణసారసంగ్రహము

శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు, బి. ఏ., బి. ఇడి.

లింగమగుంట తిమ్మకవి రచించిన లక్షణసారసంగ్రహమను పేరుగల సులక్షణసారము యొక్క తాళపత్రప్రతి దొరికిన విధమును మొదటఁ గొంత చెప్పవలసియున్నది. గుడియాత్తములో నొకరివద్ద నొక చిన్నతాళపత్రములకట్ట యున్నదని విని యతని నొకయేఁడాదిగా వేడితిని. ఎట్టకేలకు దానిని నా కతఁ డిచ్చెను. అతనికి నాతాటాకులకట్టలో నేమి కలదో తెలియదు కాని దానిని నాచేతఁ బెట్టిన మఱుక్షణమునుండి, తిరిగి యిచ్చివేయుమని ప్రాణముఁ దీసినాఁడు. అంతట వానిలో ముఖ్యమైనవానిని గ్రహించి తక్కిన తుక్కును వానికి నిచ్చివేసితిని. తనకట్ట తనకుఁ జేరినదని బహ్మానందభరితుఁడైనాఁడు. నాకు నిచ్చునప్పటికే వానికట్టలోఁ గొన్నిటి నెలుకలు, పురుగులు కొట్టివేసినవి. తక్కినవాని గతికూడ నంతియే. ఇట్టికారణములచే నతఁడు తన పేరు నిప్పట్టునఁ బ్రకటింపఁబడు భాగ్యమునుఁ గోల్పోయినాఁడు.

నేను చేఁజిక్కించుకొన్నకట్టలో సులక్షణసార భాగమేగాక, కవిరాజు వేంకటరాజు అను నతని సూర్యచ్ఛందము - దీనికి మొదలు లేదు - కవిగజాంకుశము; కవివాగ్బంధము గలవు. వీనిలో సూర్యచ్ఛందము కొత్తగ్రంథము.

నేను 1921లో వెలకుఁ దెప్పించిన సులక్షణసారముమీఁద వెల్లంకి తాతంభట్టు రచితమనియే కలదు. అది నిజముగా విచారింపఁదగిన విషయము. ఏలయన, శ్రీకందుకూరి వీరేశలింగముగారు 1899 లో నచ్చువేసిన కవులచరిత్రములో సులక్షణసారము తిమ్మకవి కృతమని స్పష్టముగా వ్రాసినారు. వావిళ్లవా రటుపిమ్మటనైనను దాము చేసినలోపమును గ్రహించి సవరించుకొన్నారు. నే నీలక్షణగ్రంథభాగమును సవరించుటలో వావిళ్ళవారు 1953 లో నచ్చువేసిన