పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోని భావమును రంగకవి రెండు మూఁడు పద్యములలోఁ జక్కగ నిమిర్చినాఁడు. కాబట్టి రంగకవి కొన్నిపట్టులలోఁ గొంత స్వతంత్రించినాఁడని చెప్పవలసియున్నది.

సులక్షణసారములో నక్కడక్కడ టీకా వివరణలుగలవు. ఇవి వ్యావహారికభాషలోనున్నవి. తిమ్మకవియే వీనినిరచించియు౦డునని వేఱుగఁ జెప్పనవసరములేదు. కస్తూరి రంగకవి వీనిలోఁ గొన్నిటికి గ్రాంథికములోనికి మార్చినాఁడు ఉదాహరణము:-

తిమ్మకవి టీక:- శ్రీకారం బెటువలెనంటే - శవర్ణ, రేఫ, ఈకారములు కూడగా శ్రీకారమాయెను. అందు శవర్ణరేఫలకు గ్రహం చంద్రుడు. కనుక ఈకారానకు గ్రహం సూర్యుడు. వారిద్దరి కన్యోన్యమైత్రి, కనుక శవర్ణ ఈకారముల కధిదేవత లక్ష్మి. రేఫకు అగ్నిదేవత. అయితేనేమి అగ్ని లక్ష్మీప్రదుండు. ఇందుకు సమ్మతి- (లక్షణ. సా వ 220).

కస్తూరి రంగకవి- శవర్ణమను ఈకారమును రేఫయును గూడిన శ్రీకారమయ్యెను. అందు శవర్ణ రేఫలకుఁ జంద్రుడు గ్రహము. ఈకారమునకు సూర్యుఁడు గ్రహము గనుక వారికిద్దఱికి నన్యోన్యమైత్రి. ఈ కారశవర్ణముల కధిదేవత లక్ష్మీదేవి, రేఫ కధిపతియగ్ని- (ఆనంరం. ఛం. వ 148)

ఈలక్షణసారసంగ్రహభాగములో 248 గద్యపద్యములున్నవి. నీనిలో 48 వఱకు వావిళ్లవారు బ్రకటించిన సులక్షణసారప్రతిని గన్నడుచున్నవి. ఆగ్రంథపరిష్కర్తలు మిగుల శ్రమపడి, యితర లక్షణగ్రంథములను బరిశీలించి, వానిని జేర్చినారు. వారు పడినశ్రమ