పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పైవానిలోఁ గొన్ని నూతనములు. కల్పవల్లరి క్రొత్తపేరు. సర్వత్ర వాదాంగచూడామణి యనియే పేరుగలదు; పాదాంగచూడామణి మొదలగు పేరు మార్పులతోఁ గానఁరాఁదు. ఇది మల్లన్న కృతమని యితర లక్షణగ్రంథములనుండి దెలియుచున్నది.

కవిరాజగజాంకుశము పే రొకతూరియైనఁ జెప్పబడినదిగాని కవివాగ్బంధము పేరు స్పృశింపఁబడనైనలేదు. కాఁబట్టి తిక్కన సోమయాజికృతమని చెప్పబడెడు నీగ్రంథము నిజముగా తిక్కనదిగాక అతనిపేరున వేరెవరో కూర్చినదని దృఢముగ జెప్పవచ్చును. భీమకవి యాదికవిగాఁ బేర్కొనఁబడినాఁడు. అతని పుస్తకము పేరు మాత్రము చెప్పఁబడ లేదు. అట్లే రేచని పేరెత్తఁబడలేదు. అటులే కవిజనాశ్రయము పేరు గూడలేదు. ఇందుఁ బేర్కొనఁబడిన లక్షణగ్రంథములలోఁ గొన్ని ఇతర లక్షణగ్రంథములలో మాత్రమె గుర్తింపఁబడుచున్నవి; విడిగ్రంథములు దొరకుటలేదు, పై జెప్పఁబడిన గ్రంథములలో, మనకుఁ దెలిసింత మట్టుకు నొకటిఁ గూడ క్రీ.శ. 1550 దాఁటివచ్చునది లేదను విషయమును గుర్తింపవచ్చును.

ఈలక్షణసారసంగ్రహమును కస్తూరిరంగకవి జాలవఱకు ననుసరించినాఁడని ముందే చెప్పియుంటిని. కాని కేవలము గుడ్డిగా ననుకరించలేదు. ఒక్కొక్కయెడ మూలములోని యంశములను విడిచిపెట్టినాఁడు. ఒక పెద్దభేదమునుఁ జెప్పెదను. తిమ్మకవి యక్షరమాలలోని యేఁబదియక్షరములయొక్క తాత్త్వికప్రభావము నేఁబదిపద్యములలో వ్రాసినాఁడు. ఇవి చాలవఱకు సంస్కృతమునకుఁ దెలుఁగే. సంస్కృతములో దీనిని పాణిని వ్రాసినాఁడని కవిరాజు వేంకట రాజకృతసూర్యచ్ఛందమునుండి తెలియుచున్నది. ఆయేఁబదిపద్యముల