పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

79

   నెసఁగుభక్తుల కొసఁగని దెద్ది లేదు
   ఏమి చెప్పుదు శ్రీరామనామమహిమ. 63

టీక. నిఖిలరోగంబుల = సమస్తమైనవ్యాధులను, నిర్మూలముగన్ = నిశ్శేషములగునట్లుగా చేయున్ (పోఁగొట్టు ననుట) భవభయంబులన్ = జన్మములవలన (అనగా: జననమరణములవలన, లేక, సంసారమువలన) కలుగుభయములను, ఎల్ల= అన్నిటిని, పాఱన్, తోలున్ = పోఁగొట్టును. బంధనంబులన్ = సకలవిధములగు నిర్బంధములను (అనఁగా అష్టపాశములవలనఁ దనకుఁగలిగినట్లు తోచుచున్న నిర్బంధములను,) పటాపంచలు గావించున్ = చెదరిపోవునట్లు చేయును. ఒలయునాపదలనున్ = వచ్చుచున్న యష్టకష్టములను, నులిమి వైచున్ = నశింపఁజేయును. సతతంబున్ = ఎల్లప్పుడును, శాత్రవవిజయంబున్ = శత్రు జయమును, సమకూర్చున్ , బహువిధదుఃఖములను =అనేకవిధము లైనదుఃఖములను, (లేక, సర్వదుఃఖములకును. కారణము లైన పంచక్లేశములను,) తూలించున్ = ధ్వంసము చేయును. దుర్దశలనున్ = హీనము లైనస్థితులను, తలఁ జూపకుండన్ = కొంచెమైనను పుట్ట కుండ, తొలఁగించున్ = అణచివేయును. సకలశుభంబులన్ = సమస్తవిధములగు శుభములను, సంగ్రహించున్ = సంపాదించును. పర ...దము పరమపావన= పవిత్రము లగువానిలో నెల్ల పవిత్రంబును, మంగళప్రదము = సకలములగుశుభముల నిచ్చునదియు, కానన్ = కావున, కలి...లోనన్ - కలిత = ప్రసిద్ధములైన, ధర్మార్థకామమోక్షములలోనన్, ఎసఁగుభక్తులకున్ = ఒప్పుచున్న (లేక , మీగుల శ్రద్ధగల) భక్తులకు (అనఁగా తన్ను సేవించువారలకు) ఒసఁగనిది = ఇయ్యకుండునది, ఎద్ది = ఏదియును, లేదు, (అనఁగా నాలుగుపురుషార్థములలో దేనిని కోరినను దాని నిచ్చుననుట) శ్రీరామనామమహిమ = రామనామప్రభావమునుగూర్చి, ఏమి చెప్పుదు = ఏమని చెప్పఁగలను.

తా. అట్లు అన్ని కోర్కుల నిచ్చుటయే కాక సాధకునకుఁ (అనఁగా  : జపము చేయువానికి) గల సకలవిధవ్యాధులను నిశ్శేషముగ ధ్వంసముఁ జేయును. జన్మ మరణరూపమగు సంసారమువలన జనించిన భయమును నివృత్తి చేయను, (అనఁగా: ముక్తినిగలిగించును . ) సకలవిధనిర్బంధములను జెదరఁగొట్టును అష్టకష్టములనుదొలఁగించును. సకలశత్రువుల పయింపఁగల సామర్థ్యము నిచ్చును. ఇంతయేకాక యే విధము లగు దుఃఖము లున్నను సర్వదుఃఖములకు మూలకారణములగు పంచక్లేశములతోఁ గూడ దొలఁగించును. (అనఁగా : మఱియెప్పటికిఁగూడఁ గలగకుండునట్లు చేయును.) సకలదుర్దశలను పోగొట్టి శుభములఁ గలిగించును. ఈరామనామము పవిత్రము లగువానిలో నెల్ల పవిత్ర మైనదియు, సకలవిధములగు మంగళముల సంపాదించు సామర్థ్యము గలదియు నగుటచేఁ దన్నాశ్రయించిన భక్తులు ధర్మార్థకామమోక్షములలో దేనిని గోరినను దాని నొసఁ