పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

శ్రీ సీతారామాంజనేయసంవాదము


వలయు నని కాని, విద్యాభివృద్ధికావలయునని కాని, తన్నాశ్రయించినవారి కెల్ల వాని నొసంగును. ఇంతమాత్రమే కాదు. రాజ్యము కావలయునన్నను, అశ్వసమృద్ధి గజసమృద్ధి కావలయునన్నను, కట్టకడకు ఏకచ్ఛత్రము వింజామరములు (అనఁగా: చక్రవర్తిత్వము) కావలయునన్నను, వానినొసంగును. ఇంతయే కాదు. ఏపుణ్యముల నాచరింపకయే, చంద్రసూర్యలోకములను గాని, స్వర్గసత్యవైకుంఠకైలాసలోకములను గాని కావలయునని కోరినను వాని నన్నిటిని ఒసంగును.

అన్వీక్షక్యాదిచతుర్విద్యావివరణము.

     "అన్వీక్షకీ త్రయీ వార్తా దండనీతిశ్చ శాశ్వతీ,
     విద్యా హ్యేతా చతస్రస్స్యుర్లోకసంస్థితిహేతవః."

అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి, అని లోకాధారములగు విద్యలు నాలుగు. ఇవి శాశ్వతములైనవి.

     "అన్వీక్షక్యాంతు విజ్ఞానం దండనీత్యాం నయానయౌ,
     అర్ధానర్థౌ చవార్తాయాం ధర్మాధర్మౌ త్రయీస్థితౌ."

అన్వీక్షకియందు సకలవిధములగు (తర్కవేదాంతాదిసంబంధములైన) జ్ఞానములు, దండనీతి (అర్థశాస్త్రము) యందు నీతి దుర్నీతులు, వార్త (ఆర్థికవిషయములని వ్యవహరింపఁబడుచున్నది.) యందు మనుష్యులకు హితములును ఆహితములును అనువిషయములు, త్రయి (వేదములు) యందు ధర్మాధర్మములు విమర్శింపఁబడియుండును. ఈ నాలుగింటిని సమకూర్చుకొని పురుషుఁడు తనజీవయాత్ర నడుపవలయును.

వ. అదియునుంగాక.62

టీక. అదియునున్ కాక = ఇట్లు కోరినకోర్కుల నిచ్చుటయే కాక.

సీ. నిఖిలరోగంబుల నిర్మూలముగఁ జేయు
          భవభయంబుల నెల్లఁ బాఱఁదోలు
    బంధనంబులఁ బటాపంచలు గావించు
          నొలయునాపదలను నులిమివైచు
    శాత్రవవిజయంబు సతతంబు సమకూర్చుఁ
          దూలించు బహువిధదుఃఖములను
    దలఁ జూప కుండ దుర్దశలను దొలఁగించు
           సకలశుభంబుల సంగ్రహించు
తే. బరమపావనమంగళప్రదము గానఁ
    గలితధర్మార్థకామమోక్షములలోన