పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

77


(అనఁగా: వారితలంపుప్రకారము ధర్మముల చక్కగ నాచరించు సామర్థ్య మొసంగి దానిమూలమున వారి నుద్దరించును). అర్ధార్థులకున్ = ధనమును గోరువారికి, అర్థములను = ధనములను, చేయున్ = కలిగించును. కామార్డులకున్ = సకలవిధము లగుభోగముల ననుభవింపఁదలంచువారికి, ఎల్ల కామంబులను = కోర్కులనెల్లను (అనఁగా : భోగసాధనములను), ఒసఁగున్ = ఇచ్చును. ఆత్మజార్థులకున్ = సంతానమును గోరువారికి, (లేక , సత్పుత్రులను గోరువారికి), ఆత్మజులన్ = పుత్త్రులను, ఇచ్చున్ , శ్రీ... లకున్ - శ్రీ = సంపత్తు, ధృతి = ధైర్యము, (అనఁగా : ఆపదలు కలిగినను జలింపకుండుట) స్మృతి = సర్వవిషయములను బాగుగ జ్ఞప్తియందుంచుకొని సమయోచితముగ స్మరింపఁగల సామర్థ్యము, యశః = కీర్తి, శ్రేయః = సర్వకాలములయందును, శుభపరంపరలు, సుఖ = శరీరమునకును మనస్సునకును, సుఖము, క్షమ = ఓర్పు, (అనఁగా: క్రోధములేకుండుట) ఇట్లు చెప్పుటవలన కామాదిశత్రువుల జయించు సామర్థ్యము అని కూడ నర్థము.) విద్యా = సకలవిద్యలు (అనఁగా : వేదాదిచతుర్దశవిద్యలు లేక, అన్వీక్షకి మొదలగు రాజవిద్యలు) వీనిని, అర్థులకున్ = కోరువారికి, వానిన్ = పై జెప్పినధనాదులను, వెలయన్ = ఒప్పునట్లుగా, (లేక, యభివృద్ధియగునట్లుగా) ఇచ్చున్, ఛత్ర... లకున్ ఛత్ర = శ్వేతచ్ఛత్రము, చామర = వింజామరములు, గజ = ఏనుఁగులు, అశ్వ = గుఱ్ఱములు, ప్రభుత్వ = రాజ్యాధిపత్యము (వీనిని అర్థులకున్ = కోరువారికి,) అవియున్ = ఆ ఛత్రాదులను గూడ, సంపాదించున్ = కలిగించును, (ఇచ్చట ఛత్రాదులు ప్రభుత్వమునకు ఆంగములే అయినను, మరల, ప్రత్యేకముగాఁ జెప్పఁబడి యున్నని కావున ప్రభుత్వశబ్దమునకు స్వల్పరాజ్యాధిపత్యము అనియును, ఛత్రాదిపదములకు "ఏకచ్ఛత్రాధిపత్యము" అనియును అర్థము) చంద్రసూర్యాలయంబులన్ = చంద్రలోక సూర్యలోకములను, స్వర్గ....లను - స్వర్గలోక, సత్య = బ్రహ్మలోకము, వైకుంఠ, కైలాస, సదనములన్ = స్థానములను, కోరువారలకున్, అవియున్, చేకూరన్ చేయున్ = ఇచ్చును.

తా. ఓ పార్వతీ! ఈ రామనామమంత్రము సర్వకాలములయందును, ఇతర సాధనములతోఁ బనిలేకయే ధర్మములఁగోరువారికి ధర్మముల నొసంగును. (అనఁగా : మనసును నిర్మలము చేసి ధర్మమునందు స్థిరతఁజేయును.) ధనములనుగాని సకలవిధములగు భోగములను గాని సత్పుత్రులను గాని, గోరువారలకు అవియెల్ల నొసంగును. సకలవిధములగు సమృద్ధులును గావలయునని గాని, చిత్తము స్థిరముగ నుండవలయు నని కానీ, చక్కని ధారణాశక్తి కావలయు నని కాని, కీర్తి కావలయు నని కాని, సర్వకాలములయందును శుభములుకలుగుచుండవలయు నని కాని, శరీరమున కారోగ్యసుఖము మనసునకు విశ్రాంతిసుఖముకలుగవలయు నని కాని, కామక్రోధాదులబాధ తొలంగ