పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

75


     బును మఱి లేదు లోకమున మూఢు లెఱుంగరు దాని నాశ్రయిం
     చిన సకలార్థసంపదలు చేకుఱు సిద్ధము శైలనందనా. 59

టీక. శైలనందనా = పార్వతీ! కన...కంటెన్ - కనత్ = ప్రకాశించుచున్న, ఉరు = గొప్పది యైన, రామనామమునకంటెన్, ఘనంబు = శ్రేష్టమైనది. అగుపాపనాశ సాధనము = ఐనట్టి పాపముల నశింపఁజేయఁగలయుపాయము, నిరం...కము. నిరంతర = సర్వకాలములయందును, (లేక , ఆటంక మేమియును లేకుండ) ఇష్ట = కోరిన, ఫల = ఫలములను, దాయకము= ఇచ్చునట్టిదియు, ఐనవిశేషకారణంబును = అగునట్టిముఖ్యమైన కారణంబును, (అనగా : ఉపాయంబును,) లోకమున్, మఱి = మఱియొక్కటి లేదు, మూఢులు - ఎఱుఁగరు = ఈవిషయమును తెలిసికొనలేరు. దానిన్ = ఆరామనామమును, ఆశ్రయించినన్, సకలార్థసంపదలు = సకలవిధము లగునిష్టఫలసమృద్దులు, చేకురున్ = కలుగును, సిద్ధము = యథార్థము.

తా. ఓపార్వతీ ! ఈలోకమున సకలపాపములు నశింపఁజేయుటకుఁ గానీ, కోరినకోర్కుల నొసంగుటకుగానీ, రామనామమునకంటే శక్తిగలపదార్దము వేఱొకటి లేదు. అయినను, ఈవిషయమును మూఢులు తెలిసికొన నేరరు. వివేకవంతులై యారామనామము నాశ్రయించిరేని వారు పొందరానిదెద్దియునులేదు. ఇది యథార్థము.

అష్టభోగములవివరణము.

శ్లో. "దాసో భృత్య స్సుతో బంధు ర్వస్తు వాహన మేవ చ,
    ధనధాన్య సమృద్ధిశ్చా ప్యష్ట భోగాః ప్రకీర్తితాః"

ఇచ్చట దాసుఁ డనఁగా, తనవలన జీతము తీసుకొనుచు సేవచేయువాడు, భృత్యుఁ డనఁగా తనయనుగ్రహమును కోరి కాని, లేక తనయం దున్న గౌరవమువలనఁగాని తనకు లోబడి తనకార్యములఁ జక్కబెట్టువాఁడు; ఈఅష్టభోగములకంటె కోరతగినది మఱియేదియుండదు కావున వీని నిచ్చట వివరించుచున్నాము.

తే. అబల శ్రీరామరామనామాఖ్యమంత్ర
   మీప్సితంబుల నర్థుల కిచ్చుచుండఁ
   గాంచి నెఱి సిగ్గుపడుచుండుఁ గల్పతరువు
   కామధేనువు నలఘుచింతామణియును.60

టీక. అబల = పార్వతీ! శ్రీ.... త్రము - శ్రీ = బ్రహ్మవిద్యారూపముగలచిత్ప్రకృతికి, (లేక, లక్ష్మికి,) రామ = మనోహరుఁడైన, రామ = రామునియొక్క ( లేక, విష్ణువుయొక్క, లేక, పరబ్రహ్మముయొక్క) నామ = పేరని, ఆఖ్య = ప్రసిద్ధిఁ జెందియున్న