పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

శ్రీ సీతారామాంజనేయసంవాదము


తా. ఓ పార్వతీ! ఉపనయనసంస్కారమును మాత్రముఁ జెంది నిష్ఠాపరులై ద్విజశ్రేష్టు లనిపించుకొనువార లైనను, సకలవిధము లగుజ్ఞానములకు నాధారమగు వేదమును బాగుగ నభ్యసించి దానియందుఁ జెప్పఁబడిన స్నానసంధ్యాదికర్మల నాచరించుచుఁ దాము కడతేరి పరులం గడతేర్చు సామర్థ్యము గల విప్రులైనను, తారకసాంఖ్యామనస్కరూప మగుయోగము నభ్యసించుచు, నిశ్చలచిత్తు లగుమహాత్ములైనను, బ్రహ్మజ్ఞానమునకై ప్రయత్నించుచు శాస్త్రోక్తప్రకారముగ సకలకర్మలఁ బరిత్యజించిన సన్న్యాసులైనను, గురువులయందును, దైవమునందును మిగుల భక్తిగలిగి యుపాసనలఁ జేయువారైనను, పరిపూర్ణ మగువైరాగ్యము గలిగి మోక్షమును గోరువారైనను, వనములు మొదలగు నేకాంతస్థలముల యందుండి చిత్తవిశ్రాంతికై ప్రయత్నించుచుఁ గాని తన కత్యధిక మగుస్థితి గలుగవలయు నని పరమేశ్వరసాక్షాత్కారము గోరుచుఁ గాని యుండువారైనను పరోక్షజ్ఞానము (పరబ్రహ్మమొక్కడున్నాడు అనుజ్ఞానము, లేక, పరబ్రహ్మమే నేను అనుజ్ఞానము) కలిగి యది యనుభవపూర్వకముగ దృఢము కావలయు నని ప్రయత్నించువారు అయినను, యీరామనామమునే ఆశ్రయింపలయును. పరబ్రహ్మము నెఱిగించు నీరామమంత్రమునకంటే శ్రేష్ఠమగునది పైఁ జూపఁబడిన యధికారులస్థితి నభివృద్ధి సేయఁగలది వేఱొక్కటి లేదు గదా. వీరే కాదు. మిగుల ననాచారపరులైన మాలవారు, ఉరియలలోని మాంసము తినువారు, కుక్కలఁ దినువారు, పక్షుల దినువారు, బోయలు, ఎఱుకులు, హూణులు, మొదలగు (తాఁకుటకు సైతము వీలులేని) జాతులవారి స్త్రీలతో సంబంధముకలవారైనను, కేవల మనాచారమాత్రమే కాదు బ్రహ్మహత్య, మద్యపానము, సువర్ణమును దొంగలించుట, గురువధూసంగమము అనుమహాపాపములను సైతము పలుమా ఱాచరించినవారైనను, తమపరిశుద్దికై రామనామమునే యాశ్రయింపవలయును. స్త్రీలుగాని క్షత్రియాదిజాతులవారు గాని, యీమంత్రజపమునం దధికారులే. ఇంతయేల? పరమపవిత్రమై సకలశుభములఁ గలిగించునది యై యున్న ఈ రామనామ మెట్టి మనోవైకల్యము కలవారి నైనను, ఏజాతికలవారి నైనను బ్రోవగలదు. వారి నభివృద్ధి జేయఁ గలదు; ఇట్లు అధికారిభేదము లేక సకలవిధము లగువారును, సకలజాతులవారును ఈమంత్రజపమున (లేక, నామజపమున) నధికారులై యుండుటయె దీనికిని ఇతరమంత్రములకును గలభేదము. ఇతరమంత్రములకు నధికారినియమము కలదు. దీని కానియమము లేదు. వీఁడు వాఁడు అనక నిది సర్వజనుల నుద్దరించును కావున నిది సర్వమంత్రములలో నుత్తమ మనుటకు సందియము లేదు.

చ. కనదురురామనామమునకంటె ఘనం బగుపాపనాశసా
    ధనము నిరంత రేష్టఫలదాయక మైనవిశేషకారణం