పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

73


అనువాక్యముల ననుసరించి ఉపనయన సంస్కారసంస్కృతు లగు) బ్రాహ్మణోత్తములకును, విప్రోత్తములకున్ (వేదపాఠేన విప్రస్స్యాత్" 'వేదాధ్యయనము వలన విప్రుఁడగును' "విశేషేణ పరాన్ పాతీతి విప్రః" (విశేషముగఁ బరులఁ గడతేర్చువాఁడు. ” ఇది సర్వపురుషార్థ సాధన మగు వేదాధ్యయనము వలనం గాని కలగదు గదా! అను మొదలగు వాక్యములం బట్టి) విప్రు లనఁదగినవారిలో శ్రేష్ఠులగువారికిని, యోగీశ్వరులకునున్ = యోగము చేయువారిలో (అనగా జీవబ్రహ్మము లొక్కటియే యని తెలుసుకొనువారలలో, లేక , తారకాదియోగముల నభ్యసించువారలలో) శ్రేష్ఠులగువారలకును యతీశ్వరులకున్ = బ్రహ్మజ్ఞానమునకై యత్నించు సన్యాసిశ్రేష్ఠులకును, భక్తి = గురు వేదాంతవాక్యములయందు శ్రద్ధయనునట్టియు (లేక, దైవభక్తియనునట్టియు,) వైరాగ్య = ఇహలోక పరలోక భోగములయం దిచ్ఛలేకపోవుటయనునట్టియు, సంపత్ =సంపదలచేత, విశిష్టులకున్ = కూడుకొనిన వారికిని, ఏకాంతవాసులకున్ = ఏకాంతస్థలము లగునరణ్యము మొదలగువానియం దుండి పరమేశ్వర సాక్షాత్కారము కొఱకుఁగాని చిత్తవిశ్రాంతికికొఱకుఁగాని ప్రయత్నించువారిని, వేదాంతులకున్ = వేదాంత శాస్త్రజ్ఞానము కలిగి (అనఁగా : పరోక్షజ్ఞానము కలిగి) యున్నవారికిని, చండాల ..కున్ - చండాల = మాలవాడు, పుల్కస = ఉరియల యందలి మాంసమును దినువారు, శ్వపచ = కుక్కమాంసమును, తినువారు, కంక = పక్షులను తినువారు, కిరాత = బోయలు, శబర = ఎఱుకులు, హూణ = హూణులు, (అనఁగా ఆంగ్లేయులు ఇంగ్లీషు వారు) వీరియొక్క, అంగనా= స్త్రీలతో, సంగతులకున్ = సమాగమముఁజేసిన వారికిని (అనఁగా: అనాచారపరులై యుండువారికిని) బ్రహ్మ ...కున్ , బ్రహ్మహత్యా= బ్రహ్మహత్య, సురాపాన = కల్లుద్రాగుట, హేమస్తేయ = సువర్ణమును దొంగిలించుట, గురువధూసంగమ, (ఈమహాపాపములను) కర = చేసినవారిలో, వరులకున్ = శ్రేష్ఠులైనవారికిని, (అనఁగా : కేవలమనాచారపరులగుటయే కాక, పంచమహాపాపములనఁబడు బ్రహ్మహత్యాదులఁ బలుమాఱు లొనరించిన వారికిని ) సుంద... కున్ - సుందరీ= స్త్రీలు, క్షత్రియ = క్షత్రియులు, ఊరవ్య = వైశ్యులు, శూద్రులకును, (సర్వవర్ణముల వారికిని అనుట, ఇతరమంత్రములకు అన్ని వర్ణముల వారు నధికారులు కారు అని తెలుసుకొనవలయును.) మఱియున్ నానా.. లకున్ - నానావిధ = అనేకవిధములైన, (అనఁగా: ఆచారములయం దనేకభేదములుగల,) అనేక = లెక్కకు మిక్కిలి యగు (అనఁగా : అనేకజాతి భేదములుగల,) మానవులకున్ = మనుష్యులకును, పరమపావనము ఐ = పవిత్రము లగుపదార్థములలో నెల్లఁబవిత్రమై, శుభప్రదమును ఐన రామనామంబు = సకలశుభముల నిచ్చునట్టిదియు నైనఆరామనామమే శరణంబు = రక్షకము.