పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

69


నెమలివంటిది. ( నెమలి సర్పముల కెంతశత్రు వైనను గొంతశాంతగుణముగలది యయ్యెనేని యొకానొక సర్పము నొకానొకప్పుడు చంపక విడచినను విడువవచ్చును గావున నట్టిశంక కవకాశము లేకుండుటకై ఇచ్చట క్రూరపదము ప్రయోగింపఁబడినది.) అనృ...త్రము - అనృతభాషణ = అసత్యమాడుట యనియెడు, వల్లీ = తీఁగెకు , మహా లవిత్రము= గొప్ప (మిగులపదునుగల) కొడవలివంటిది. ఆర్య ... ద్రము - ఆర్యదూషణ = పెద్దలఁదిరస్కరించుట యనియెడు, పంకేరుహ = పద్మములకు, ద్విపేంద్రము = గజశ్రేష్ఠమువంటిది. అఖి. . . లంబు - అఖిల = సమస్తమైన, కలుష = పాపములనియెడు, అంబునిధి = సముద్రమునకు, బడబానలంబు=బడబాగ్ని వంటిది.

తా. ఓపర్వతరాజపుత్రీ! ఈ రామనామము సూర్యుడు చీకటిని పోఁగొట్టునట్లు బ్రహ్మహత్యను బోఁగొట్టును. గాలి మేఘముల చెదరగొట్టునట్లు మద్యపాన మహాపాపమును చెదరగొట్టును. వజ్రాయుధము కొండల నురు మాడునట్లు స్వర్ణస్తేయమహాపాపమును ధ్వంసము చేయును. సింహము మదగజమును బరిమార్చునట్లు గురువధూసంగమమహాపాపమును రూపు మాపును. దావానలము మహారణ్యములఁ గాల్చునట్లు తల్లి తండ్రి, యన్న దమ్ములు శిశువులు స్త్రీలు గురువులు మొదలగువాని వధించు పాపములఁ గాల్చి వేయును. క్రూరస్వభావము గల నెమలి తాఁజూచిన పాము నెల్ల వధించునట్లు పరస్త్రీసంగమ పరధనాపహారాదిమహా పాపములఁ దలలెత్తకుండునట్లు చేయును. మిక్కిలి పదను గలకొడవలి మృదువగుతీఁగెను అతిసులభముగ ఛేదించునట్లు అసత్యభాషణదోషమును ఛేదించును. మదపుటేనుఁగు తామరతీఁగెల నున్మూలించునట్లు సజ్జనదూషణ మనియెడు పాపము నున్మూలించును. ఇంత యేల? బడబానలము మహాసముద్రముల నింకించునట్లు సకలవిధము లగుపాపముల నింకించును. దీనితో సమానమగునది మఱియొకటి లేదు.

తే. రమణి యవశముచే నైన రామనామ
    మమర వర్తింపఁ బడు చుండ నఖలపాత
    కములచే విడ్వఁబడుసుమ్ము సుమతి యపుడె
    సింహ మతిభీతమృగములచేతఁబోలె.58

టీక. రమణి = ఓ పార్వతీ!, అవశముచేన్ ఐనన్ = మనఃపూర్వకముగాఁ గాక నేదియో యొకకారణము చేత నైనను, రామనామము, అమరన్ = ఒప్పునట్లుగా, వర్తింపఁ బడుచుండన్ = ఉచ్చరింపఁబడఁగా, సుమతి ఆరామనామము నుచ్చరించిన మహాత్ముఁడు, సింహము, అతిభీతమృగములచేత పోలెన్ = తనను చూచినతోడనే మిగులభయముఁజెందుస్వభావము గలలేళ్లచేతవలె, అపుడె = రామనామోచ్చారణఁ