పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

శ్రీ సీతారామాంజనేయసంవాదము


మున తొలఁగిపోవును. ఈ పాపములన్నియు, రామమంత్రమును జూచిన నెప్పుడును భయపడుచుండును.

సీ. బ్రహ్మహత్యాఖ్యపాపతమోర్కబింబంబు
         మధుపానదోషాభ్రమారుతంబు
    తపనీయచౌర్యపాతకశైలభిదురంబు
         గురువధూగమనాఘకుంజరహరి
    జననీపితృభ్రాతృవనితార్భకాచార్య
         గోవధారణ్యోరుదావవహ్ని
    పరసతీసంగమ పరధనహరణాది
         ఘోరపంకోరగక్రూరబర్హి
తే. యనృతభాషణవల్లీమహాలవిత్ర
    మార్యదూషణపంకేరుహద్విపేంద్ర
    మఖిలకలుషాంబునిధిబడబానలంబు
    రామనామంబు హిమశైలరాజతనయ.52

టీక. హిమశైలరాజతనయ - పర్వతరాజగుహిమవంతునకుఁబుత్రికవగునో పార్వతీ, రామనామంబు = రామమంత్రము, బ్రహ...బంబు - బ్రహ్మహత్యాఖ్య= బ్రహహత్య యనియెడుపేరుగల, పాప = పంచమహాపాతకములలో మొదటిదగు పాపమను, తమః = చీకటికి, అర్కబింబంబు = సూర్యబింబము వంటిది. (సూర్యుఁడుదయింపఁగానే, యెంతగాఢమగు చీఁకటియు విచ్చిపోవునట్లు ఈ రామనామము స్మరింపఁబడినతోడనే బ్రహ్మహత్య తొలంగిపోవుననుట) ; మధు... తంబు - మధుపానదోష = మద్యపానమనియెడు, అభ్ర = మేఘమునకు, మారుతంబు = ప్రబలమగువాయువువంటిది, తప...రంబు - తపనీయచౌర్యపాతక = స్వర్ణస్తేయపాప మనియెడు, శైల = పర్వతమునకు, భిదురంబు = వజ్రాయుధమువంటిది. గురు... హరి - గురుగమనాఘ = గురువధూగమనపాప మనియెడు, కుంజర = ఏనుగునకు, హరి = సింహమువంటిది, జననీ . . వహ్ని- జననీ = తల్లియొక్కయు, పితృ = తండ్రి యొక్కయు, భ్రాతృ = అన్నదమ్ముల యొక్కయు, వనితా = స్త్రీలయొక్కయు, అర్భక = శిశువులయొక్కయు, ఆచార్య = గురువుల యొక్కయు, గో = గోవులయొక్కయు, వధ = సంహారమనియెడు, అరణ్య = అరణ్యమునకు, ఉరుదావవహ్ని = గొప్ప (అరణ్యమునంతయును దహింపఁగల) దావానలము వంటిది. పర... . బర్హి - పరసతీసంగమ - పరస్త్రీసమాగమము, పరధనహరణ = ఇతరులధనముల నపహరించుట, ఆది = మొదలుగాఁగల, ఘోర = భయంకరములైన, పంక = పాపములనియెడు, ఉరగ = సర్పములకు, క్రూరబర్హి = క్రూరమైన