పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

61

క. ఈ రేడుజగములందును, నారీమణి విమలరామనామముచేతం
   జీరఁబడనిఘనదుర్భర, ఘోరమహాఘంబు లేదు కోరి వెదకినన్. 50

టీ. నారీమణీ= స్త్రీరత్న మగు ఓ పార్వతీ, ఈరేడుజగములందు = ఈపదునాలుగు లోకములయందును, విమల...చేతన్, విమల = పవిత్రమైన, రామనామముచేతన్ = రామనామమంత్రముచేత, జీర..ఘంబు - జీరఁబడని = నశింపఁజేయఁబడని, ఘన= అధికమైన, దుర్భర= ఓర్వరాని, ఘోర = భయంకరమైన, మహత్ = గొప్పదైన, అఘంబు= పాపము, కోరివెదకినన్ = కావలయునని వెదకినప్పటికిని, లేదు = దొరకదు.

తా. ఓ పార్వతీ ! ఈపదునాలుగులోకములయందు నెచ్చట వెదకినను, ఎంత శ్రద్ధతో విమర్శించినను, రామనామజపము నశింపఁజేయలేని పాపమేలేదు. (అనఁగా: ఎంతగొప్ప దైనను, ఎంత భయంకరమైన దైనను, ఎన్నిమాఱులు మనఃపూర్వకముగాఁ జేయఁబడిన దైనను పాపము రామనామజపముచేఁ దక్షణమే ధ్వంస మగును.)

తే. బ్రహ్మహత్యాయుతము మద్యపానదశశ
    తమును గుర్వంగనాకోటిగమనదురిత
    మపరిమితహేమచౌర్యంబు లనవరతము
    రామనామాభిహతము లోరాజవదన.51

టీ. ఓ రాజవదన = చంద్రునివంటి ముఖము గల యో పార్వతీ, బ్రహ్మహత్యాయుతము = పదివేల బ్రహ్మహత్యలును, మద్యపానదశశతంబు = వేయిమద్యపానదోషములును, గుర్వంగనాకోటిగమనదురితము = కోటిసంఖ్య గలగురుపత్నులఁ గవయుదోషంబును (ఇచ్చట ఆయుతాదిశబ్దములకు “లెక్కకు మిక్కిలి యైనవి” అనియే యర్థము గాని, ఆయాసంఖ్యలు మాత్రమే యర్థములుగావని దెలిసికొనవలయును.) అపరిమితహేమచౌర్యంబులు = లెక్కకుమిక్కిలియగుస్వర్ణస్తేయమహాపాపములును (స్వర్ణస్తేయమనఁగా: బంగారమును దొంగిలించుట (పరులధనమునపహరించుట,) ఈ విధముగ పంచమహాపాతకములలోని నాలుగు పాపములను గూర్చియు చెప్పఁబడియుండుటచే పైనాలుగుపాపములలో దేనినైనను చేసినవారితో స్నేహము చేయుట యను నైదవ పాపమును గూర్చి కూడ చెప్పఁబడియెను.} అనవరతమున్ = ఎల్లప్పుడును, రామ...ములు - రామనామ = రామమంత్రముచేత, అభిహతములు = పోఁగొట్టఁబడినవి, (ఈ పాపము లన్నిటిని రామమంత్రము పోఁగొట్టుననుట.)

తా. ఓ పార్వతీ, పదివేలబ్రహ్మహత్యలు గాని, లెక్కకు మిక్కిలి యగు మద్యపానదోషములు గాని, గురువధూసంగమదోషములు గాని, సువర్ణస్తేయములు గాని, ఇట్టిపాపులతో సహవాసము చేయుటవలనఁ గలుగుదోషములుకాని (అనఁగా: మహాపాపములు అని చెప్పఁబడు అయిదును), రామమంత్ర జపముచే నిమిషమాత్ర