పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

68


నామమును మూఁడుమాఱులు చెప్పుట స్టూలసూక్ష్మకారణములను మూడుశరీరములకును దాని నభిమానించు మువ్వురు జీవులకును, జాగ్రత్త మొదలగు మూడవస్థలకును, పవిత్రత కలిగించుటకును, ఆధ్యాత్మికము మొదలగు మూఁడు తాపములను శాంతి నొందించుటకును, శ క్తిగలదై యుండుననియు నీవిషయమును సూచించుటకే అట్లు చేయఁబడిన దనియు తెలిసికొనవలయును.)

తా. ఓ సుందరాననా! మనోహారిణీ పార్వతీ నేను శ్రీ రామరామరామయని జపముచేయుచు, సర్వకాలములయందు నారామునియందే నిలచి యానందించు చుండెదను. ఈ రామనామ మితరనామములు వేయింటికంటె నధికమై జపించినవారలకు భోగమోక్షముల నొసంగును. కావున దీనిని గ్రహింపుము. ఈ రామనామమంత్రమే సకలమంత్రములలో నుత్తమము.

శ్రీరామనామార్థము శివుండు పార్వతికిఁ దెలుపుట.

అవ. ఈరామనామమంత్రముయొక్క యర్థమును వివరించి, 'ఈమంత్రమె యన్నిటిలో నుత్తమము' అను విషయమును ఈ క్రింద మూడుపద్యములచే నిరూపించుచున్నాఁడు.

క. ఆది పరబ్రహ్మప్రతి, పాదక మత్యంత పరమపావనము సుమీ
   యీదివ్యమంత్రరాజము, మోదితధర్మార్థకామమోక్షప్రదమున్. 46

టీ. ఈ. . . జము - ఈదివ్య = శ్రేష్ఠమైన, మంత్రరాజము=మంత్రములలో నుత్తమ మగు రామమంత్రము, ఆ...కము - ఆది = ప్రపంచమునకు నాది కారణమగు, లేక “అహ మాదిశ్చ మధ్యం చ భూతానా మంత యేవ చ " " నేను (పరబ్రహ్మమును) సమస్త భూతములకును, ఆది మధ్య అంత స్వరూపుఁడను ”(అనఁగా: ఈ భూతములు పుట్టుటకును, నిలుచుటకును స్థానభూతుఁడను) అనుగీతావాక్యమును బట్టి ఉత్పత్తి స్థితి ప్రళయ కారణభూతుఁడగు (ఇచ్చట ఆదిశబ్దముచే మధ్యాంతములు కూడ చెప్పఁబడినవని తెలిసికొనునది) పరబ్రహ్మ = పరబ్రహ్మమును, ప్రతిపాదకము = తెలియఁజేయునది. (రామనామము పరబ్రహ్మవాచక మనుట) అత్యంతపరమపావనము = మిక్కిలి పవిత్రములని చెప్పదగిన వస్తువులలోనెల్లఁ బవిత్రమైనది. మోది...దమున్ - మోదిత = మంత్రజపముచే సంతసించువారికి (అనఁగా: సర్వకాలములయందును రామనామధ్యానమును జేయుటయే యానందముగాఁ గలవారికి,) ధర్మార్థకామమోక్ష = ధర్మము మొదలగు నాలుగు పురుషార్థములును, ప్రదమున్ = ఇచ్చునది.

తా. ఓ పార్వతీ ! ఈరామనామమంత్రము సకలమంత్రములలోను శ్రేష్ఠమైనది. ఏల యనఁగా; ఇతరమంత్రము లన్నియును ఉపాధివశమున ననేకవికారములు