పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

51


బ్రకాశించుచుండును. పదివిధము లగు ఓంకారధ్వములు మంగళవాద్యములై యెప్పుడును అచ్చట మ్రోయుచుండును. ఇట్టి కొలువుకూటమున, ఉపనిషదర్థమగు జీవబ్రహ్మైక్యమును ప్రత్యక్షముగఁ జూపఁజాలు ఓంకార మనియెడు సింహాసనముపై శుద్దసత్త్వప్రధానంబగు మాయయే యాకారముగాఁ గలిగి సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సృష్టిస్థితిసంహారకత్వములు మొదలగు సకలకళ్యాణగుణములచే నొప్పుచు, సత్యజ్ఞానానందస్వరూపుఁడై, దేవతలకు దేవత యై యుండు నా మహాదేవుఁడు కొలువు దీఱి యుండెను. అమ్మహాత్ముని దయారసపూర్ణములగు కటాక్షములఁ గోరుచు, స్వరూపములఁ దాల్చిన యిరువదినాలుగు తత్త్వములును, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనుశక్తులును, విష్ణువు బ్రహ్మ ఇంద్రుఁడు మొదలగు దేవతలును, నందికేశ్వరుఁడు భృంగీశ్వరుఁడు, విఘ్నేశ్వరుఁడు మొదలగు ప్రమథులును, బ్రాహ్మి మొదలగుసప్తమాతృకలును, కుమారస్వామియును సేవించుచుండిరి. అప్పరమశివుఁడు బ్రహ్మానుభవము సేయుచు పరమానందపరవశుఁడై యుండెను. ఆట్లున్నసమయంబున, నమహాత్ముని శరీరమునందలి వామభాగమే తనశరీరముగాఁ గలదియు, పరాప్రకృతి అపరాప్రకృతి పరాపరాప్రకృతి అనియెడు మూఁడు ప్రకృతులును స్వరూపముగాఁ గలదియు, సకలప్రపంచమునకును ఉపాదానకారణ మైనదియు (కార్యరూపముగాఁ బరిణామములు చెందు కారణము ఉపాదానకారణ మనఁబడును. కుండకు మట్టి ఉపాదానకారణము గుడ్డకు నూలు ఉపాదానకారణము) సకలలోకమునకుఁ దల్లియు, మూఁడులోకములు తనకుఁ గుటుంబము గాఁ గలదియు, సకలప్రపంచమును మోహింపఁ జేయునదియు, బ్రహ్మజ్ఞానముచేఁ బ్రకాశించుబుద్దియే ముఖముగా జ్ఞానమును అనుభవసహితజ్ఞానమును నేత్రంబులుగ వైరాగ్యము పెదవిగ వేదాంతవిచారము చిఱునగవుగ మమకారములు లేకుండుట ఆహంకారములు లేకుండుట అనునవి హస్తములుగ రాజయోగము జ్ఞానము అనునవి స్తనములుగ సంశయము నడుముగ సంసారచక్రము బొడ్డుగ అభిలాష, వైరము అనునవి కటిపురోభాగముగ కామము లోభము అనునవి తొడలుగ సంకల్ప వికల్పంబులు పాదములుగ కాలము ననుసరించి వచ్చు ప్రారబ్ధకర్మములు నడకలుగఁ బ్రకాశించుచు, బ్రహ్మజ్ఞాన మనియెడు చీరెయు, చిత్తవిశ్రాంతి యనియెడు ఱవికయు, జాగ్రత్స్వప్నసుషుప్త్యపస్థాసంధు లనియెడు కోకముడి ఱవికముడి కొప్పు అనునవియు, ఫలాపేక్ష లేకుండ తనవర్ణమునకును ఆశ్రమమునకును దగినకర్మల నాచరించుట పరమేశ్వరధ్యానము గురుసేవ ఇంద్రియములను మనస్సును జయించుట దృఢమగువిజ్ఞానము అను మొదలగు సద్గుణములు అనియెడు భూషణములును, తన సౌందర్యమునకు సొంపు గూర్చుచుండఁ బరిశుద్ధ మగు మనోవృత్తు లనియెడు సువాసనలచేఁ గలుగు పరిమళము వ్యాపించుచుండ నప్పార్వతి సర్వకాలములయం