పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

శ్రీ సీతారామాంజనేయసంవాదము


సంబంధపడనిదియు, ఇంద్రియములకుఁ గాని మనస్సునకుఁ గాని గోచరము గాక, ప్రత్యక్షాదిప్రమాణములచేతఁ దెలియరానిదియు, ఇది యింతయని పరిమితి చెప్పుటకు వీలులేనిదియు, పరిశుద్ధమై సకలప్రపంచమునకంటె వేఱై అనుభవసహిత మగు జ్ఞానమునకుం దక్క మఱిదేనికిని గోచరముగాక సచ్చిదానందరూపమై యుండు నాతురీయాతీతపరబ్రహ్మమో యనఁ బ్రకాశించుచుండును. పరబ్రహ్మరూప మగునాకైలాసపర్వతమున అవ్యక్తము మొదలగు నేడు ప్రాకారములచేత నలంకరింపఁబడినదియు, పదునాల్గు లోకములను గుహయఁదు నిర్మింపఁబడినదియు, చక్రవర్తిమొదలు చతుర్ముఖునివఱకు ననేకతారతమ్యములతో నున్నయానందము లనియెడురాళ్లపైఁ గట్టఁబడినదియు, సూర్యుఁడు చంద్రుడు అగ్ని నక్షత్రములు మెఱపులు మొదలగు జ్యోతులే రత్నములుగా, నారత్నముల యొక్క చూర్ణమే యిసుక గాఁ గలదియు నై, బ్రహ్మానుభవమనియెడు నొక కొలువుకూటమున రాజిల్లుచుండెను. దాని సమీపమున పరిశుద్ధ మగువైరాగ్యమే యేకాగ్రచిత్తముతో ధ్యానము చిత్తవిశ్రాంతి, మిగుల త్వరగామోక్షము కావలయు నని ఇచ్చ అను పర్వతాగ్రభాగమున మొలచి బ్రహ్మానందమను నీరు పోయుటచే పెరిగి నిష్కామకర్మము యాగములు యోగములు జపములు కృఛ్రము చాంద్రాయణము మొదలగు తపస్సులు ఉపాసనలు సత్యముపలుకుట పరిశుద్ధత్వము దయ మంచిస్వభాపము దానము వ్రతము మొదలగు ఫలవృక్షములు మనసు నిశ్చలముగా నుండుట యనియెడు పిందెలతో నొప్పి ఫలించుచునుండును. వేదాంతములును, ఆగమాంతములును అనియెడు కల్పవృక్షపు తీఁగెలును శాస్త్రము లనియెడి పుష్పములచే నొప్పుచుండును. ఇట్లాఫలవృక్షములతోడను, పూఁదీఁగెలతోడను రాజిల్లునుపవనంబులు లెక్కకు మిక్కిలియై యాకొలువుకూటమునకుఁజుట్టును గ్రమ్ముకొని యుండును. షడ్విధసమాధు లనియెడుమేడలు, దాని పార్శ్వములయందు గలవు. మఱియు, పరిశుద్ధమగు చిత్తవృత్తి యనియెడు దానిముంగిలి, బ్రహ్మానందమనియెడు జలముచేఁ దడుపఁబడి మనోనిగ్రహము ఇంద్రియనిగ్రహము చిత్తశాంతి ఓర్పు శ్రద్ధ తృప్తి గర్వము లేకపోవుట డంబము లేకపోవుట మొదలగు సద్గుణములే రత్నములు గా, నారత్నములచే మ్రుగ్గులు పెట్టి యలంకరింపఁబడి యుండును. అచ్చట సర్వాధిక మగుమోక్ష మనియెడుబొక్కస మొకటి గలదు. ఫలమును గోరక వేదోక్తకర్మల నాచరించుటయు, మనశ్శుద్ధియు, సర్వకర్మల శాస్త్రోక్తవిధానంబున విడుచుటయు, గురుభక్తియు వేదాంతవాక్యముల వినుటయు, విచారించుటయు, వాని యర్థమును ధ్యానించుటయు, బ్రహ్మ నెఱుంగుటయు ననుసోపానములచే నలంకరింపఁబడి, అనుభజ్ఞాన మనియెడు రాజవీథియొకటి దానిసమీపమునకుఁ బోవుచుండును. పంచాక్షరీమంత్ర మనియెడు మాణిక్యములచేఁ జెక్కబడి ద్వారములు మిగులఁ