పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

55


శించుచున్నదియును, (నివసింపఁబడినదియును అనఁగా : పరిశుద్ధము లగు మనోవృత్తుల కాధారమైనదియును. అని రెండవయర్థము “వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధాచ మలినాతథా, మలినా జన్మ కృత్ప్రోక్తా శుద్ధా జన్మవినాశనీ” “శుద్ధవాసన యనియు మలినవాసన యనియు, వాసన మనోవృత్తి, లేక, మనస్సునం దున్న సంస్కారము రెండు విధములు. అందు శుద్ధ వాసన పునర్జన్మమును నశింప జేయును, మలినవాసన దానిని గలిగించును” అని తెలిసికొనవలయును,) నిత్యానపాయినియున్ = శివుని నెప్పుడు నెడఁబాయనిదియు, దేవదేవియున్ = స్వప్రకాశరూపుఁ డగు పరమశివునకు భార్యయును అగు, శ్రీ మహాదేవి = బ్రహ్మవిద్యాస్వరూపిణి యగు పార్వతీదేవి, అతిప్రియపూర్వకంబుగాన్ = మిగుల ప్రీతితో, చతుర్విధశుశ్రూషలు- నాలుగువిధములగుసేవలను (శిష్యులు గురువులకు సేయు సేవకు శుశ్రూష యని పేరు.) కావించుచున్ = చేయుచు, సేవించుచున్ = పూజించుచున్, భావించుచున్ =ధ్యానము చేయుచు, నమస్కరించుచున్, ఆరాధించినన్ = ఆపరమేశ్వరుని మనసునకు సంతసమును గలిగింపఁగా, ప్రసన్నుండు ఐ = అనుగ్రహదృష్టిచేఁ జూచుచు, సుముఖుఁడై, మెచ్చి, నీకున్ ఎయ్యది ఇష్టంబు = నీకేమికావలయును. ఇచ్చెదన్ , అడుగుము, అనినన్ = అని చెప్పఁగా, సంతో .. ఐ -సంతోష = ఆనందముచేత, భరిత = నిండింపఁబడిన, చిత్తయై- మనస్సుగలదై, అమ్మత్తకాశిని = ఆపార్వతీదేవి, చిఱునవ్వు నగుచున్ , ఇట్లు అనియెన్ = ఈ క్రింద రాఁబోవువిధముగా చెప్పెను.

తా. మొదలు నడుమ తుది యనునవి లేక యేవిధ మగునికరవస్తువులవలనఁ గూడ భేదములు చెందక, స్థిరమై ప్రత్యక్షమై యున్న తన కాంతిచే ననేకకోట్లసూర్యచంద్రాగ్నులఁ దిరస్కరించుచు వేదశాస్త్రాగమాదులయందు సుప్రసిద్ధమైన బహువిధము లగు వర్ణములచేతఁగాని, తనకు విరుద్ధములగు పొట్టితనము మొదలైన ధర్మముల చేతఁ గాని, నడక మొదలగు పనులచేతఁ గాని, యితరగుణముల చేతఁ గాని, కైలాస మను ప్రసిద్ధమైన యొకపేరు తప్ప యితరము లగుపేర్లచేతఁగాని, తెలుపుగాని యితరరూపములచేతఁ గాని, వికారములచేత గాని, కఠినత్వము అనునదితప్ప తక్కినశక్తులచేతఁ గాని ఆశ్రయింపఁబడక (కైలాస మని మిగుల ప్రసిద్ధి చెందిన తెల్లనివర్ణము గలదియై అనుట) బ్రహ్మ, దేవేంద్రుఁడు మొదలగు దేవతలును, సిద్ధసాధ్యవిద్యాధరచారణగంధర్వాదులును, నారదాదులగు దేవమునులును, దత్తాత్రేయుఁడు మొదలగు యోగీశ్వరులును, అగస్త్యాదిమహర్షులును, సనకసనందనాదులును, సర్వకాలములయందును సేవించుచుండ నా కైలాసపర్వతము నాశరహితంబును రూపము గుణములు వికారములు సంకల్పములు మొదలగునవి లేనిదియు, ఏసాధనముచేతనైనను తెలిసికొనుటకు వీలుకానిదియు, శబ్దాదివిషయములతోఁ గూడ