పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

శ్రీ సీతారామాంజనేయసంవాదము


అనుభవింపక యుండుటయు, అను నవియే, ఊరుయుగళయున్ = తొడలుగాఁ గలదియును, సంకల్పవికల్పచరణయున్ = సంకల్పవికల్పములే పాదములుగాఁ గలదియును. (సంకల్పవికల్పములే సకలవిధములగు ప్రవర్తనములకును సాధనములుగావునఁ జరణములతోఁ బోల్పఁబడినవి, దుర్గుణములన్నియును బరిత్యజింపవలసిన వని సూచించుటకై యధఃకాయరూపముగ వర్ణింపఁబడియున్నవి.) కాలా... యున్ - కాల = కాలములచేత, అవగత = వచ్చిన, పుణ్యపాప మిశ్రకర్మములే, యానయున్ = నడకలుగాఁ గలదియును, వేదాం...యున్ - వేదాంత విద్యావసన = బ్రహ్మవిద్య యనియెడువస్త్రమును, ఉపరతికంచుక = చిత్తవిశ్రాంతి యనియెడు ఱవికను,ధారిణియున్ = ధరించినదియు, రజస్సత్వ ... సురుచిరయున్ -రజః = రజోగుణము యొక్కయు, సత్త్వ = సత్వగుణము యొక్కయు, తమః = తమోగుణముయొక్కయు, గ్రంథి = ముడులను, (సత్త్వగుణము జాగ్రదవస్థ, దానికిని రజోగుణ మగు స్వప్నావస్థకును మధ్యనుండు సంధియును, ఇట్లే తమోగుణరూపమగు సుషుప్త్యవస్థకును స్వప్నావస్థకును మధ్య నుండు సంధియును, ఇట్లే జాగ్రదవస్థకును సుషుప్తికిని మధ్యనుండుసంధియును అను నీమూడుసంధులును, అనగా : ముళ్లును. ) నీవీబంధ = పోకముడియు, కంచుకాబంధ= ఱవిక ముడియు, వేణిబంధ = జడముడియు, కొప్పును, అగునట్లుగా, సురుచిరయున్ = ప్రకాశించుచున్నదియును, (పైనవర్ణించియున్న మూఁడుముడులును, ఈ పార్వతీదేవికిఁ గలకోకముడి మొదలగుమూడుముడులుగా నున్నవి యనుట.) ఫలత్యా... కారిణియున్ - ఫలత్యాగపూర్వక = ఫలమును గోరకుండుటయె ప్రధానముగాఁగల, వర్ణ = బ్రాహణాదివర్ణములకును, ఆశ్రమ + బ్రహ్మచర్యము మొదలగు ఆశ్రమములకును, ఉచిత = తగిన, (అనఁగా; వేదమునందు విధింపఁబడిన,) ధర్మ = స్నానము సంధ్య మొదలగునిత్యకర్మములతోను, శ్రాద్ధము మొదలగు నైమిత్తికకర్మములతోను, గూడిన సకల విధములధర్మములు, అనుష్ఠాన= వాని నాచరించుటయు (లేక, ఫలత్యాగపూర్వకముగ సర్వధర్మములను ఆచరించుటయు,} ఈశ్వరప్రణిదాన = భగవద్ధ్యానమునకు, ఆచార్యోపాసన = సద్గురు సేవ, ఇంద్రియ = జ్ఞానేంద్రియములయొక్కయు కర్మేంద్రియముల యొక్కయు, ఆత్మ = మనస్సుయొక్కయు, వినిగ్రహ = జయించుట, స్థితప్రజ్ఞత్వ = దృఢమగుపరమార్థజ్ఞానము కలిగియుండుట, ఆది= మొదలైన, సాత్త్వికగుణ = సత్త్వగుణమును సంపాదించుకొనుటవలనఁగలిగిన చక్కనిమనోవృత్తులు (దీనికే దైవసంపద యని పేరు.) అనియెడు, భూషణ = నగలు, అలంకారిణియున్ = అలంకారముగాఁ గలదియును, శుద్ధవాస. . యున్ - శుద్ద = సత్త్వరజస్తమోగుణములులేని, (అనఁగా: శుద్ధసత్త్వమయ మైన,) వాసనా - మనోవృత్తులచేతను, చందనము పుష్పములు మొదలగుసుగంధములచేతను; ఈ రెంటికివి శుద్ధసత్వము సమానమే. వాసితయున్ = పరిమ