పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

53


బుద్దియే ముఖముగాఁగలదియు, జ్ఞాన...యున్ -జ్ఞాన = పదపదార్థ విజ్ఞానము. (మహావాక్యములయందలి పదములయొక్క వాక్యార్థము. అనఁగా, పైకిదోఁచునర్థము యొక్కయు లక్ష్యార్థము. అనఁగా: వాక్యార్థములయందున్న విరోధములను బోఁగొట్టుటకై యూహింపవలసిన యర్థము యొక్క జ్ఞానము. ) విజ్ఞానము = అనుభవపూర్వకమైన జ్ఞానమును, లోచనయున్ = కన్నులు గాఁగలదియును, విషయ...యున్ - విషయ = శబ్దస్పర్శాదివిషయములయందలి, విరక్తి = వైరాగ్యమే, ఆధరయున్ = పెదవిగాఁ గలదియును, (వైరాగ్యమునకంటే నధికమగు నానందము లేదు గావునను అధరామృతము నాస్వాదించుట పరమానందకరము గావునను ఇట్టియుపమానము చెప్పఁబడినది, ఇట్లే తక్కినచోట్లను అచ్చటసందర్భముల కనుకూలముగ పోలిక గలదని యూహింపవలయును.) విచారమంద...యున్ - విచార = బ్రహ్మవిద్య విచార మనునదియే, మందస్మితయున్ = చిఱునవ్వుగా గలదియును, (పరిశుద్ధముగా నుండుటయే ఇచ్చట బ్రహ్మ వికారమునకును చిఱునగవునకును పోలిక.) నిర్మ...యున్ - నిర్మమతా = ఇది నాది యనునభిమానములేకుండుట, నిరహంతా= నేను అను అభిమానములేకుండుట, (అనునవియే,) హస్తయున్ = హస్తములుగాఁ గలదియును, (సర్వకార్యములును జేయుటకు హస్తములే ముఖ్యసాధనము లైనట్లు ముక్తిని జెందుటకు అహంకారమమకారముల విడుచుటయే ప్రధానసాధనము గావున నిట్లు పోల్పఁబడెను.) యోగబోధస్తనియున్ = రాజయోగంబును, (లేక, కర్మయోగంబును,) జ్ఞానంబును స్తనములుగాఁ గలదియు, (క్షీరమను అమృతమును వర్ణించు స్తనములతో బ్రహ్మానందామృతమును వర్షించు యోగజ్ఞానములకుఁ దగినపోలిక గలదని యెఱుఁగునది.) సందేహమధ్యయున్ = నేను జీవుడనో, బ్రహ్మంబునో అనునట్టి సందేహమే నడుముగాఁగలదియును, (ఇచ్చట "కలదా లేదా అను సందేహమునకు ఆశ్రయ మగు మిగుల సన్ననగు నడుము గలది” అని రెండవయర్థముగలదు, ) సంసారచక్రనాభియున్ = సంసారచక్రమే బొడ్డుగాఁగలదియును, (సంసార మనఁగా : పురుషునిబహువిధములగు కార్యములయందు ప్రవర్తింపఁ జేయు అహంకారము. అది చక్రమువలె ఆద్యంతములు లేనిది కావున ఆద్యంతములు లేకుండుట అనునది అహంకారచక్రములకును, గుండ్రముగా నుండుట అనునది చక్రనాభులకును క్రమముగా పోలిక లని యెఱుంగునది) రాగ...యున్ - రాగ = తనకుఁగావలసిన వస్తువులయందుఁ బ్రేమ. ఆవస్తువును సంపాదింపవలయునని త్వర, ద్వేష = తనకక్కఱ లేనివస్తువుల వైరము, వానిని బరిత్యజించుట, జఘనయున్ = కటిపురోభాగముగాఁ గలదియు, (" క్లీబే తు జఘనం పురః" "జఘన మనునది కటి పురోభాగమునకు పేరు. అది నపుంసక లింగము" అని అమరము) కామ...యున్ = పరస్త్రీ పరధనాదులను గోరుటయు, లోభ = తనధనమును బరుల కీయక తానైనను