పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ సీతారామాంజనేయసంవాదము

52


శ్రీ మహాదేవుఁడు = అయిన శోభాయుక్తుఁడగు సాంబమూర్తి, మూర్తిమంతంబులు = ఆకారములను ధరించినవి, అయిన చతుర్వింశతితత్త్వంబులును = స్థూలశరమునందుండు నిరువదినాలుగుతత్త్వములును, (ఆకాశాదిభూతము లైదు, జ్ఞానేంద్రియములు అయిదు, కర్మేంద్రియములు అయిదు, ప్రాణము లయిదు, మనోబుద్ధిచిత్తాహంకారములు నాలుగు, యివి యిరువదినాలుగుతత్త్వములు.) ఇచ్చా.. బును-ఇచ్ఛా = సృష్టి చేయవలయునని తలంచుట అనుశక్తియును, జ్ఞాన = జీవరూపమును ప్రవేశించి సమస్తమును దెలిసి కొనుచుండుశక్తియును, క్రియా = ప్రాణరూపముతో శరీరమునందుండి సమస్తములగు కర్మేంద్రియముల చేతను పనులఁజేయించునట్టి శక్తియును, ఆదిశక్తులును మొదలగు నానావిధము లగుశక్తులును, సత్వశక్తి, రజశ్శక్తి, తమశ్శక్తి మొదలగునని యనుట.) హృషీ...లును హృషీకేశ్వర = విష్ణువు, వాణీశ్వర= బ్రహ్మ, సురేశ్వర = ఇంద్రుఁడు, నందికేశ్వర = నంది, భృంగీశ్వర = భృంగి, విఘ్నేశ్వర = వినాయకుఁడు, కుమార = కుమారస్వామి, ఆది = మొదలైన, ప్రమథగణ = ప్రమథుల సమూహముయొక్క (ప్రమథులు శివునిసభయందు సభ్యులు,) అధీశ్వరులును = ప్రభువులును, బ్రాహ్మీ ... లును, బ్రాహ్మీమహేశ్వర్యాది = బ్రాహ్మి మహేశ్వరి మొదలగు సప్తమాతృకలును, (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనువారేడుగురు మాతృక లనఁబడుదురు.) స్వసాన్నిధ్యంబునన్ = తన సమీపమున, నిజ. . .బున్ - నిజ = తన (రుద్రుని) యొక్క కరుణా = దయతోఁగూడిన, కటాక్ష వీక్షణంబున్ = కడగంటిచూపును, ఆవేక్షించి = కోరి, (దయారసపూర్ణముగ నారుద్రుఁడు తమ వైపుఁ జూచునా యని కోరుచు అనుట.) కొలువన్ = సేవించుచుండఁగా, స్వస్వరూపావలోకనంబు = తనస్వరూపమును, (అనఁగా: పర బ్రహ్మస్వరూపమును,) చూచుటను, (లేక, అనుభవించుటను,) చేయుచున్ = బ్రహ్మానుభవము చేయుచు (పరమానందసముద్రమున మునిఁగి అని భావము.) ఆత్మారాముండు ఐ =తనలోఁ దాను ఆనందించుచున్న వాఁడై, ఉన్న సమయంబునన్ = ఉన్నప్పుడు, తదీయున్ - తదీయ = ఆ యీశ్వరునియొక్క, వామార్థ = ఎడమదగుసగభాగమే, శరీరిణియున్ = శరీరముగాఁ గలదియు, పరాపరప్రకృతి స్వరూపిణియున్ = పరాప్రకృతి అపరాప్రకృతి పరాపరప్రకృతి అనుమూఁడుప్రకృతులును స్వరూపముగాఁ గలదియు, (ఈ ప్రకృతులను గూర్చి మూలమునందే స్పష్టము చేయఁబడును.) నిఖిలజగదుపాదానకారణభూతయున్ = సమస్తజగత్తునకును ఉపాదానకారణ మైనట్టియు, నిఖిల.. .యున్ - నిఖిల = సమస్తమైన,లోక = లోకములకు, ఏక = ముఖ్యమైన, మాతయున్ = తల్లియును, త్రిభువనగేహినియున్ = మూఁడులోకములును దనకుఁగుటుంబముగాఁ గలదియు, విశ్వమోహినియున్ = ప్రపంచమును మోహింపఁ జేయునదియు , ధీముఖియున్ = పరిశుద్ధ మగు