పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

51


క్యమును దెలిసికొందురనిభావము. ఓంకారమునకు అర్థ మాపరబ్రహ్మయే కావునను "తజ్జపస్తదర్థభావనం"= "దానిని జపించుట దానియర్థమును మనసున ధ్యానించుట” సాక్షాత్కారమునకు సాధనములు “అది యనఁగా ఓంకారము” అనుయోగ సూత్రమునుబట్టి జపకాలమునందు, ఆ పరబ్రహ్మమును (అనగా: ఆయన యథార్థస్వరూపమును) స్మరించుచుండుట యత్యావశ్యక మగుటచేతను, దీనికి శ్రవణాదులుఁగూడ సహాయ మయ్యెనేని జీవబ్రహైక్య జ్ఞాన మతిశీఘ్రములో గలుగు ననుటకు సంశయమేలేదని తెలిసికొనవలయును. సింహాసన = సింహాసనమునందు, ఆసీనుండై = కూర్చున్న వాఁడై, శుద్ధ . . .డును. శుద్ధసత్త్వ = శుద్ధసత్త్వమే, ( లేక గుణసౌమ్యావస్థయే) గుణసామ్యమనఁగా : మూఁడుగుణములును ఎక్కువ తక్కులులేక యుండుట; లేక , గుణసామాన్యసత్త్వరజస్తమము లను భేదములు లేక , వాని కన్నిటికి నాధారమైయుండు గుణత్వజాతి) ప్రధాన = ముఖ్యముగాగల, (అదియే స్వరూపము గాఁ గల యనుట.) మాయామయ-మాయ = మాయయె ఆకారముగాఁ గలిగినట్టియు, దివ్య = శ్రేష్ఠమైనట్టియు, (ఆమాయ ఆవరణము కాఁ గలది అయినను, దానివికారములతోఁ గొంచెమైనను సంబంధపడకుండునట్టి అనుట), శోభన = ఉపాసకులకు శుభముల నొసంగునట్టియు, విగ్రహుండును = శరీరము గలవాడును, ("మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్" = "మాయయె ప్రకృతి. ఆమాయ ఉపాధిగాఁ గలవాఁడు ఈశ్వరుఁడు” అను శ్రుతి ననుసరించి, యిచ్చట ఈశ్వరస్వరూపము వర్ణింపబడె నని చెప్పవలయు) సర్వ.. .డును-సర్వజ్ఞత్వ = సమస్తమును దెలిసికొనుట, సర్వేశ్వరత్వ = సమస్తమునకును ప్రభు పగుట. (లేక , సమస్తప్రపంచమును ఆజ్ఞాపించుట.) సర్వాంతర్యామిత్వ = సమస్తప్రపంచమునందును వ్యాపించి తనమాయాశక్తిచే దానిని స్వకర్మానుగుణముగానడుపుట “ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా” = "శరీర మనుయంత్రముపై నెక్కియున్న యీసకలజీవులను, దనమాయాశక్తిచే తత్తత్కర్మానుగుణముగఁద్రిప్పుచు, నాపరమేశ్వరుడు సర్వభూతములహృదయములయందును ఉన్నాఁడు" అను గీతావాక్య మీవ్యాఖ్యానమునకుఁ బ్రమాణము. ) సర్వసృష్టృత్వ = సకలమును సృష్టి చేయుట, సర్వరక్షకత్వ= సమస్తమును చాలించుట, సర్వసంహారకత్వ= సర్వమును లయింపఁ జేయుట, ఆది = మొదలగు, అగణిత = లెక్క పెట్టఁగూడని, సమగ్ర = సంపూర్ణములైన, సుగుణపరిగ్రహుండును = సద్గుణములు గలవాడును, సత్యజ్ఞానానందస్వరూఫుఁడును, సర్వవ్యాపకుండును, దేవదేవుండును -దేవ = ఇంద్రియాదిదేవతలకు, (లేక, ఇంద్రాది దేవతలకు,) దేవుండును = దేవత యగువాఁడును , (అనఁగా: నియామకుఁ డగువాడును, లేక, తనప్రకాశముచే నింద్రియములఁ బ్రకాశింపఁజేయువాఁడును.) ఆగు