పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

శ్రీ సీతారామాంజనేయసంవాదము

 ములయందు విధింపఁబడిన, కర్మ = తమతమకులములకుఁ గలకర్మలను, ఆచరణ = ఆచరించుటవలనఁ గలిగిన, చిత్తశుద్ధి = మనశ్శుద్ధియును, సర్వకర్మపరిత్యాగ= సకలములగు దుష్కార్యములను విడిచి పెట్టుటయును, గురుభక్తి, వేదాంత = వేదాంతవాక్యములను, శ్రవణ= వినుట మనన = మనసునందు విచారణ సేయుట, నిదిధ్యాసన = నిశ్చయించిన విషయమును ఏకాగ్రచిత్తముతో ధ్యానించుట, జ్ఞాన= స్వస్వరూపజ్ఞానంబును, ఆది = మొదలైనదనెడు, సోపాన = మెట్లతోడ, సమన్విత = కూడిన, విజ్ఞాన = బ్రహ్మానుభవమనెడు, రాజమార్గ = రాజవీథులలో, లలితంబును = మనోహరమైనదియును, పంచ... బును - పంచాక్షరీ = నమశ్శివాయ' అను అయిదక్షరములు గల, మహామంత్ర = గొప్ప మంత్రమనెడు, మాణిక్య = మాణిక్యమైన, తోరణ= వెలుపలివాకిండ్లచేత, అలంకృతంబును = అలంకరింపఁబడినదియును, ప్రణవ....తంబును - ప్రణవనాద = పదివిధములగు ఓంకారనాదము లనియెడు (ఈదశవిధనాదములను గూర్చి ముందు గ్రంథకర్తయే సవిస్తరముగ వివరింపఁగలఁడు.) మంగళవాద్య = శుభకరములైన, వాద్యముల రవ = ధ్వనిచేత, పూరితంబును = నిండింపఁబడినదియు, అగు= అయినట్టి, తురీయ. ..బునన్ - తురీయ = ఉన్మన్యవస్థయనియెడు. (జాగ్రదాది మూఁడవస్థలవలె సహజముగా వచ్చునది గాక యపరోక్షబ్రహ్మజ్ఞానము వలనఁ గలుగునట్టి యీయున్మన్యవస్థయే బ్రహ్మానందానుభవ మనియును నిర్వికల్పసమాధియనియును జెప్పఁబడినది.) మహాస్థానమంటప = గొప్పకొలువుకూటము యొక్క, అంతరంబునన్ = లోపల, (ఇచ్చట ఈ యున్మన్యవస్థకును, పరబ్రహ్మమునకును నామములందుఁ దప్ప రూపములందు భేదము లేదు, గావున బరబ్రహ్మమునకు ఆవరణములగు మూలప్రకృతి మొదలగువానిని ఈ ఆస్థానమంటపమునకు ప్రాకారములు గాను మఱియు నాయావస్తువులను సోపానాదులు గాను వర్ణించి యున్నారు.) "కందరసుందరంబును, గండశైల భాసురంబును" అనుచో రమణీయం బగునొకానొక కైలాసగుహలో నున్నదనియు, ఒకానొకవిశాలమగు బండపైన నమర్చఁబడినదనియు "అధిత్యక...ఉద్యాన” అను విశేషణబలమువలన నాగుహయు బండయు పర్వతముయొక్క పైభాగమునందు (శిఖరమునకంటే కొంచెము క్రింద) నున్న వనియు, అర్థము చెప్పుట యుక్తమని తోఁచుచున్నది. లేకున్న నాస్థానమంటపమందు గుహలు గండశైలములుండుటకు వీలులేదు గదా. (“ఆగుహశిఖరమున కంటెఁ గొంత క్రిందనున్నది” అని చెప్పకున్నయెడల నచ్చట గండశైల ముండుటకు వీలుండదని తెలియవలయును.) సర్వో...నుండై - సర్వ = అశేషములైన, ఉపనిషత్ = వేదాంతములయొక్క, సౌరభూత = సారాంశమైన, బ్రహ్మాత్మకత్వ = జీవుఁడును బ్రహ్మయును ఒక్కటియే అనువిషయమును, దర్శక = చూపునట్టి, రూప = స్వరూపముగల, ఓంకార = ప్రణవ మనియెడు, ఓంకారమును ధ్యానించినవారు శీఘ్రముగ జీవబ్రహ్మై