పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

47


లగుమహాయోగులును, మునీశ్వర =అగస్త్యాదులును, యతీశ్వర = గోవిందభగవత్పాదులు శంకరాచార్యులు మొదలగు యతులును, కవీశ్వర = వాల్మీకిలోనగుకవులును, ఆది = మొదలగువారిచేత, ఉపాస్యంబును = సేవింపఁదగినదియును (ఈ విశేషణమునకు పరబ్రహ్మపక్షమునందును, పర్వతపక్షమునందును, అర్థమొక్కటియే.) నిత్య . . .బును - నిత్య = భూతభవిష్యద్వర్తమానకాలములందు నాశనమును జెందక సర్వకాలములందును స్థిరమై యుండునట్టియు, నిర్గుణ = సత్త్వము రజస్సు మొదలగు గుణములు లేనిదియు, నిర్వికల్ప= చిత్తము లేనిదియగుటచే. సంకల్పించుట, సంశయించుట , మొదలగునవి లేనిదియు, నిర్వికార = వికారములు లేనిదియు, నిరాకార = రూపము లేనిదియు, నిరంజన = ఇతరసాధనములతో పనిలేక తనను తానే యెఱుంగునదియు, (స్వప్రకాశమైనది అనుట) నిర్విషయ = శబ్దము స్పర్శము మొదలగువిషయములు లేనిదియు, (విషయములతో సంబంధపడనిదియు, లేక, విషయములు కూడ తనకంటె వేఱుగాకపోవుటచే, “విషయములను తెలిసికొనుట” అనుమాట లేనిదియు) అతీంద్రియ= ఇంద్రియములకు గోచరము గానిదియు, అవాఙ్మానసగోచర = వాక్కుచే చెప్పుటకును, మనస్సుచే భావించుటకును గూడ వీలుకానిదియు, అప్రమేయ= ఇంకయని పరిమితిఁ జెప్పుటకు వీలులేనిదియు, (లేక, ప్రత్యక్షము మొదలగు నేప్రమాణములకును గోచరము కానిదియు,) శుద్ధ = నిర్మలమైనదియు, బుద్ధ = జ్ఞానముచే తెలియఁదగినదియు, ముక్త = ఇతర పదార్థములతో సంబంధము లేక స్వతంత్రమై యుండునదియు, (ఇచ్చట స్వతంత్రమనగా: “ఏపదార్థముతోఁ గాని, యేగుణముతోఁ గాని సంబంధము లేక యున్నది" అని యర్థము. పైన నొకవిశేషణములో "పరబ్రహ్మమునకు స్వతంత్ర శక్తి లేదు” అని చెప్పఁబడియున్నది. దానికి “తన్ను ప్రేరేపించునాఁడు లేక తాను యథేచ్ఛముగా ప్రపంచమును ఆజ్ఞాపించుట అనుశక్తి లేదు” అని యర్థము.) కేవల = తనకంటే రెండవపదార్థము లేనివాఁడును, అఖండ = విభాగములు చేయుటకు వీలులేనిదియును, సచ్చిదానందమయంబును = సత్యజ్ఞానానందస్వరూపంబును, ఐన, తురీ ..బునన్ - తురీయ = సుషుప్త్యవస్థకంటె నావలనుండు తురీయావస్థను, (జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలు క్రమముగ సత్త్వరజస్తమోగుణస్వరూపము లనియు, ఆయవస్థల కావలనుండు తురీయావస్థ శుద్ధసత్త్వస్వరూపమైనదనియు తెలిసికొనవలయును) అతీత = అతిక్రమించిన, ఐదవయవస్థకంటె,(ఈయయిదవ యవస్థ, పైనఁజూపబడిన నాల్గవయవస్థలోని కడభాగమేకాని క్రొత్తది కాదు.) పర = మిగిలిన, తత్త్వ = పరబ్రహ్మ మనెడు, కైలాసంబునన్ = కైలాసమునందు, అస్య...బును - అవ్యక్త = మూలప్రకృతియును, మహత్ = ప్రపంచోత్పత్తికి ప్రథమావస్థ యగు మహత్తత్త్వము, ఆది = మొదలుగాఁ గల, సప్తావరణ = ఏడు ప్రాకారములచేత, పరివేష్టితంబును = ఆవరింపఁబడినదియును, (మూలప్రకృతి, మహత్తత్వము, శబ్దస్పర్ఫరూపరసగంధము లనియెడు నేడును