పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

శ్రీ సీతారామాంజనేయసంవాదము


మ్యంబును = తెలియనలవికానిదియును అనియర్థము) బహు...బును - బహువిధ= అనేకవిధములగు, వర్ణ = నలుపుపసుపు మొదలగునవర్ణములు, ధర్మ = (పొడుగగుట పొట్టియగుట మొదలగు) ధర్మములును, కర్మ = కదలుట, నడచుట మొదలగు) పనులును, గుణ (స్వభావసిద్ధము లైన గుణములకంటె వేఱైన) గుణములను, నామ = (కైలాసము అను పేరుకంటె వేఱగు) పేర్లును, రూప = (సహజమై యుండు తెలుపునకంటె వేఱైన) రూపంబును, వికార = (సిద్దముగా నుండుట అను దానికంటె వేఱగు) వికారములును, శక్తి = {కఠినముగా నుండుట - అను దానికంటె నితరములగు) శక్తులును, (శిలయొక్కకఠిినత్వము, అగ్నియొక్క వేఁడిమి, మంచుయొక్క చల్లఁదనము, ఇవి యన్నియు వానివానిశక్తు లనఁబడును.) విరహితంబు= లేనిదియు, (బ్రాహ్మణాది వర్గములును, ఆ వర్ణములకుఁ దగిన ధర్మములు, ఆచారములు, సత్త్వరజస్తమోగుణములు, సకలవిధము లగునామరూపములు, ఉండుట పుట్టుక ముదలగువికారములు, సర్వస్వతంత్రుడగుట, దేనితోను సంబంధపడకయుండుట, నాశరహితుఁ డగుట, అనాదియగువిజ్ఞానమే స్వరూపముగాఁ గలిగి యుండుట, సర్వమును దెలిసికొనుట, సర్వకాలములయందును తృప్తి గలిగి యుండుట, అనునట్టి యాఱుశక్తులును లేనివాడు అని పరబ్రహ్మపక్షమునం దర్థము.) బ్రహ్మే ...బును - బ్రహ్మ= చతుర్ముఖుండును, ఇంద్ర = దేవేంద్రుడును, ఆది = మొదలు గాఁగల, అమర = దేవతలును, అసుర= రాక్షసులుసు, ఉరగ =అనంతుఁడు(వాసుకి మొదలగు సర్పములు)ను, గరుడ = గరుడులును, గంధర్వ = గంధర్వులును, కిన్నర= అశ్వముఖు(మనుష్యశరీరము గలకిన్నరు)లును, కింపురుష = (నరముఖము అశ్వశరీరము గల విశ్వవసు పరావసు ప్రభృతులగు) కింపురుషులును, సిద్ధ, సాధ్య, విద్యాధర, చారణ (దేవేంద్రునిచారులు లోకవృత్తాంతమును తెలిసికొనివచ్చి, యాయనకుఁ జెప్పువారు.) అప్సరః = అప్పరసలు (రంభ ఊర్వశి మొదలగు వారు) యక్ష= కుబేరుఁడు మొదలగు యక్షులును, గుహ్యక = (మాణిభద్రుఁడు మొదలైన) గుహ్యకులును, భూత = గ్రహములును, (ఉరగ అనుపదము మొదలిప్పటి వఱకుఁ జెప్పఁబడిన వారందఱును దేవతలే యైనను, వేఱు వేఱుజాతులు గలవారు గావున ప్రత్యేకముగాఁ జెప్పఁబడిరి.) ఖేచర = సూర్యాదులు, దేవర్షి = నారదాదులును, (వీరు దేవతలలోఁ బుట్టి మును లైరి గావున దేవర్షు లనఁబడుచున్నారు) బ్రహ్మఋషీశ్వర సనకాదులును, (భక్తి యోగాదుల నవలంబింపక కేవలజ్ఞాననిష్టులై పరబ్రహ్మనిష్ఠులై యున్న మునులు గావున వీరలకు బ్రహ్మఋషు లని పేరు. బ్రాహ్మణులై జన్మించి ఋషులైనవారికిఁ గూడ నీ పేరు గలదు గానీ యీవిశేషణమునందు మునీశ్వర అని సామాన్యమునివాచక మగు పదము కలదు. గావున నిచ్చట నా యర్థముఁ జెప్పుట వీలులేదు, ఈపదము మొదలు విశేషణాంతమువఱకు ప్రతిపదమునందును గానవచ్చు ఈశ్వరశబ్దము శ్రేష్ఠవాచకమని తెలిసికొనవలయును) యోగీశ్వర = కపిలుఁడు దత్తాత్రేయుఁడు మొద