పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

45

నడుగు మనిన సంతోషభరితచిత్త యై యమ్మత్తకాశిని చిఱునవ్వు నగుచు నిట్లనియె.40

టీక. అది = ఆమహాకైలాసపర్వతము, (పరబ్రహ్మమనియు రెండవయర్థము కలదు. ఈ వచనమునందు పరబ్రహ్మమునకును, కైలాసమునకును ఆ భేదమును వర్ణించుచున్నాఁడు) మఱియున్, ఆది.....నంబును- ఆది = మొదలు, మధ్య=నడుమ, అంత= తుదియు, విహీనంబును = లేనిదియు, (పర్వతపక్షమునందు మిగుల విశాలమైన దనియు, బ్రహ్మపక్షమునందు ఉత్పత్తి స్థితి వినాశములు లేనిదనియు నర్థము.) స్వజా. . .బును- స్వజాతీయ = తనజాతికి సంబంధించినవానివలనఁ గాని, విజాతీయ =మఱియొకజాతికి సంబంధించిన వస్తువులవలనఁ గాని, స్వగత = తనయందేయున్న యనేకపదార్థములవల్లఁ గాని కలుగు, భేద= భేదముతో, శూన్యంబును = లేనిదియును, (ఏక మే వాద్వితీయం బ్రహ్మ ' అను శ్రుతి ప్రకారము ఆ పరబ్రహ్మమునకు తనజాతిలోఁ జేరిన మఱియొక బ్రహ్మవలనఁ గాని యితరజాతిలోఁ జేరిన మాయాప్రపంచము మొదలగువానివలనఁ గాని, తమలోపలనే యుండు నింద్రియములు మనస్సు మొదలగువానివల్లఁగాని భేదము లేదు. అనఁగా; ఆయన యొక్కఁడె యనుట. ఈవిశేషణమునకు పర్వతపక్షమున నంతచక్కనియర్థము దొరకుట లేదు. అయినను అనేక పర్వతములును, వృక్షములును, భేద మేర్పఱుచుటకు వీలులేకుండ చుట్టు నావరించియున్న వనియు, ఆపర్వతముపై మొలచియున్న తీగెలు మొదలగునవి కూడ నట్టే దాని నావరించి యున్నవని కాని; లేక, ప్రపంచమునందున్న సకల పర్వతములును, వృక్షములు రాళ్లు మొదలగునవియును, ఆపర్వతమునందు మొలిచియున్న తీఁగెలు మొదలగునవియును అనఁగా; ప్రపంచమంతయు, ఆ కైలాసపర్వతముయొక్క కాంతిచే తెల్లనై యేది కైలాసమో యేది యితర పదార్థమో అను భేదమును కనిపెట్టుటకు వీలులేక యున్నది అని కాని చెప్పవచ్చును.) నిత్య. . .లోకంలును - నిత్య = శాశ్వతమైన, అపరోక్ష = సకలజనులకును ప్రత్యక్షమైన, (బ్రహ్మపక్షమునందు జ్ఞానులకు ప్రత్యక్షమైన) స్వప్రకాశ = తనయొక్కకాంతిచే, అపహసిత = తిరస్కరింపఁబడిన, అనంతకోటి = లెక్కలేనికోట్లసంఖ్యగల, సూర్య = సూర్యులయొక్కయు, చంద్ర = చంద్రులయొక్కయు, అనల = అగ్నిహోత్రములయొక్కయు, ఆలోకంబును = కాంతి గలదియు (రెండుపక్షములయందును 'అపరోక్ష ' అను స్థలమున తప్ప తక్కినచోట్ల సమానమే. అచ్చటివిశేషమును అచ్చటనే చూపియున్నాను.) వేద ...బును - వేద = చతుర్వేదములచేతను, శాస్త్ర = ఆఱుశాస్త్రములచేతను, పురాణ = పదునెనిమిది పురాణముల చేతను, ఇతిహాస = భారతరామాయణాదీతిహాసములచేతను, ఆగమ = కామికముమొదలగు నిరువదియెనిమిది ఆగమములచేతను, అగమ్యంబును = చక్కఁగాఁ దెలియఁదగినదియును, (పరబ్రహ్మపరమున, అగ