పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

శ్రీ సీతారామాంజనేయసంవాదము

కల్యాణగుణమణిగణరంగవల్లీప్రకాశితంబును నిరతిశయకైవల్యభాం డాగారశోభితంబును ఫలకామనాభావస్వభావనియతకర్మాచరణచిత్త శుద్ధిసర్వకర్మపరిత్యాగగురుభక్తి వేదాంతశ్రవణమనననిధిధ్యాసనజ్ఞా నాదిసోపానసమన్వితవిజ్ఞానరాజమార్గలలితంబును బంచాక్షరీమహా మంత్రమాణిక్యతోరణాలంకృతంబును బ్రణవనాదమంగళ వాద్యరవ పూరితంబును నగుతురీయమహాస్థానమంటపాంతరంబున సర్వోపనిష త్సారభూత బ్రహ్మాత్తైకత్వదర్శనరూపోంకారసింహాసనాసీనుం డై శుద్ధ సత్వప్రధానమాయామయదివ్యశోభనవిగ్రహుండును సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వసర్వాంతర్యామిత్వసర్వస్రష్టృత్వసర్వరక్షకత్వసర్వసంహా రకత్వాద్యగణితసమగ్రసుగుణపరిగ్రహుండును సత్యజ్ఞానానందస్వరూ పుండును సర్వవ్యాపకుండును దేవదేవుండునునగు శ్రీమహాదేవుండు మూర్తిమంతంబు లైనచతుర్వింశతితత్త్వంబులును నిచ్ఛాజ్ఞాన క్రి యాదిశక్తులును హృషీకేశ్వరవాణీశ్వరసురేశ్వరనందికేశ్వరభృంగీశ్వర విఘ్నేశ్వరకుమారాదిప్రమథగణాధీశ్వరులును బ్రాహ్మీ మాహేశ్వ రాదిసప్తమాతృకలును స్వసాన్నిధ్యంబున నిజకరుణాకటాక్షవీక్ష ణంబు నపేక్షించి కొలువ స్వస్వరూపావలోకనంబు సేయుచు నాత్మా రాముఁ డై యున్నసమయంబునఁ దదీయవామార్ధశరీరిణియుఁ బరా పరప్రకృతిస్వరూపిణియు నిఖిలజగదుపాదానకారణభూతయు నఖి లలోకైకమాతయుఁ ద్రిభువనగేహినియు విశ్వమోహినియు ధీముఖ యు జ్ఞానవిజ్ఞానలోచనయు విషయవిరక్త్యధరయు విచారమందస్మితయు నిర్మమతానిరహంతాహస్తయు యోగబోధస్తనియు సందేహమధ్య యు సంసారచక్రనాభియు రాగద్వేషజఘనయుఁ గామలోభోరు యుగళయు సంకల్పవికల్పచరణయుఁ గాలానుగతకర్మయానయు వేదాంతవిద్యావ్యసనవసనోపరతికంచుకధారిణియు రజస్సత్త్వతమో గుణగ్రంధినీవీబంధకంచుకబంధవేణీబంధసురుచిరయు ఫలత్యాగ పూర్వవర్ణాశ్రమోచితధర్మానుష్ఠానేశ్వరప్రణిధానాచార్యోపాసనేంద్రి యాత్మవినిగ్రహస్థితప్రజ్ఞత్వాది సాత్త్వికగుణభూషణాలంకారిణియు శుద్ధవాసనావాసితయు నిత్యానపాయినియు దేవదేవియు నగుశ్రీమ హాదేవి యతిప్రీతిపూర్వకంబుగాఁ జతుర్విధశుశ్రూషలు గావిం చుచు సేవించుచుఁ బూజించుచు భావించుచు సమస్కరించుచు నారాధించినం బ్రసన్నుండై మెచ్చి నీకు నెయ్యది యిష్టం బిచ్చెద