పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

43


కైలాసము = పరబ్రహ్మము, (లేక పర్వతము. ఇది యుపమాలంకారము కావున విశేషణములయందు మాత్రము శ్లేష యుండినఁజాలును. విశేష్యమగు కైలాసపదమునందు కూడ అర్థద్వయము నంగీకరించినచో శ్లేషాలంకారమగును.) చిద్విలాసంబుఅగుచున్ = అపరోక్షజ్ఞానమే రూపముగాఁ గలదియై, తనరారున్.

తా. శుద్ధసత్త్వప్రధాన మగుమాయకు నాశ్రయమైై తనను కర్మయోగముచే నుపాసించువారలకు (బ్రహ్మము వేఱు; తాను వేఱు, అనుభేదదృష్టి కలిగి సుఖములు కావలయునని పరబ్రహ్మమును సగుణరూపముతో సేవించువారలకు అనుట.) ధర్మార్థ కామముల నొసంగుచు, జ్ఞానయోగముచే నుపాసించువారలకు, (జీవబ్రహ్మైక్యమును తెలిసి కొనినవారలకు) మోక్షము నిచ్చుచు, జీవావిద్యలు తానేయై, నిర్వికారుఁడై సూర్యచంద్రాగ్నులసహితము ప్రకాశింపఁ జేయజాలుదివ్యతేజస్సుతో జ్ఞానరూపుఁ డగు నాపరబ్రహ్మము ప్రకాశించుచున్నది.

వ. అది మఱియు నాదిమధ్యాంతవిహీనంబును స్వజాతీయవిజాతీయ
   స్వగత భేదశూన్యంబును నిత్యాపరోక్షస్వప్రకాశాపహసితానంత
   కోటినూర్యచంద్రానలాలోకంబును వేదశాస్త్రవురాణేతిహాసాగ
   మాగమ్యంబును బహువిధవర్ణధర్మకర్మగుణనామరూపవికారశక్తి
   విరహితంబును బ్రహ్మేంద్రాద్యమరాసురోరగగరుడగంధర్వకిన్నర
   కింపురుషసిద్ధసాధ్యవిద్యాధరచారణాప్సరోయక్షగుహ్యకభూతఖేచర
   దేవర్షి బ్రహ్మఋషీశ్వర యోగీశ్వరమునీశ్వరయతీశ్వరకవీశ్వరాద్యుపా
   స్యంబును నిత్యనిర్గుణనిర్వికల్పనిర్వికారనిరంజననిర్విషయాతీంద్రియా
   వాఙ్మానసగోచరాప్రమేయశుద్ధబుద్ధముక్తకేవలాఖండసచ్చిదానంద
   మయంబు నైన తురీయాతీతపరతత్త్వకైలాసంబున నవ్య క్తమహ
   దాదిసప్తావరణపరివేష్టితంబును జతుర్దశలోకకందరమందరంబును
   సార్వభౌమాదిహిరణ్యగర్భాంతానందగండశైలభాసురంబును
   భానుసోమనక్షత్రతారాగ్రహపావకసౌదామన్యాది వివిధతేజోరత్న
   శర్కరిలంబును బ్రవిమలవైరాగ్యోపరత్యేకాంతాత్యంతముముక్షు
   తాధిత్యకాధ్యాత్మానందజీవనాభిషిక్తనిర్మలనిశ్చలతాకలికాకలితఫలి
   తనిష్కామకర్మోపాసనాయాగయోగజపతపస్సత్యశౌచదయాశీలవ్రత
   దానాదినానావిధానోకహోద్యానవిరాజితంబును శాస్త్రపుష్పోపేత
   నిగమాగమాంతకల్పలతావిలసితంబును షడ్విధసమాధిసౌధవిభ్రాజి
   తంబును బరమాధ్యాత్మవిద్యానందజలాభిషిక్తనిర్మలచిత్తవృత్త్యం
   గణ శమదమోపరతితిక్షాశ్రద్ధాసమాధానామానిత్వాదంభిత్వాది