పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

శ్రీ సీతారామాంజనేయసంవాదము

పరబ్రహ్మమునకు ఆకరణములు అనఁగా : పరబ్రహ్మమును దెలిసికొనకుండునట్లు చేయునది. ఈయేడింటిని ఆస్థానమంటపము యొక్క ప్రాకారముగా చెప్పియున్నాఁడు. ఇట్లే యీ విశేషణములయం దంతటను, వేదాంతమునకు సంబంధించిన విషయముల నన్నిటిని, వృక్షములు గుహలు మొదలగువానినిగాఁ జెప్పియున్నాఁడు.) చతు..బును - చతుర్ధశలోక = పదునాలుగులోకములనియెడు, కందర = గుహలచే, సుందరంబును = మనోహరమైనదియు, సార్వ . . బును - సార్వభౌమాది = చక్రవర్తి మొదలు, హిరణ్యగర్భాంత = చతుర్ముఖబ్రహ్మ వఱకు నుండువారియొక్క, ఆనంద = సుఖము లనెడు, (అనేక తారతమ్యములతో నున్న ఆనందము లనియెడు.) గండశైల = జాఱుడురాళ్లచేత, భాసురంబును = ప్రకాశించుచున్నదియును, (అనఁగా: చక్రవర్తి, మనుష్యగంధర్వులు, ఆదేవతలలోని గంధర్వులు, పితృదేవతలు , ఆజానజానులను దేవతలు, కర్మదేవతలు, దేవతలు, ఇంద్రుడు బృహస్పతి, నవబ్రహ్మలు, చతుర్ముఖబ్రహ్మ , వీరియానందములు క్రమముగా, నొకరియానందమునకంటె నొకరి యానందము నూఱు రెట్లధికము), భాను... రిలంబును - భాను = సూర్యుఁడు, సోమ = చంద్రుడు, నక్షత్ర = నక్షత్రములు, తార = ఆశ్విని మొదలగు నిరువది యేడు నక్షత్రములు. (అశ్విని మొదలగు నిరువదియేడు నక్షత్రములు తప్ప మిగిలినవి నక్షత్రములని సామాన్యముగాఁ జెప్పఁబడును. అశ్విన్యాదులకు తారలు అని పేరు.) గ్రహ = అంగారకాది గ్రహములును (చంద్ర సూర్యులనుగుఱించి యిదివఱకే చెప్పబడియున్నది.) పావక = అగ్నియును, సౌదామని = మెఱుపులును, ఆది = మొదలుగాఁ గల, వివిధ = నానావిధము లైన, తేజః= దీప్తులనెడు, రత్న = మణులచే, శర్కరిలంబును = గండిసుకగలదియును, ప్రవి...బును - ప్రవిమల = నిర్మలమైన, వైరాగ్య, ఉపరతి = చిత్తవిశ్రాంతియును, ఏకాంత = నిశ్చలచిత్తమును, అత్యంతముముక్షుతా = శీఘ్రముగ మోక్షము కావలయు ననుదృఢనిశ్చయమును, (లేక, స్థిరమగుకోర్కియును) అనెడు, అధిత్యకా = పర్వతము పైభాగమునందలి, (పర్వత పై భాగమునందు మొలచియున్న అనుట.) ఆధ్యాత్మానంద = బ్రహ్మానంద మనియెడు, జీవన = జలము చేత, అభిషిక్త = తడుపఁబడినట్టియు, నిర్మల నిశ్చలత్వ కలికా = చాంచల్యము లేక యుండుట అనియెడు మొగ్గలచేత, (లేక, పిందెల చేత,) కలిత = ఒప్పుచున్నట్టియు, ఫలిత = పరిపక్వములైనట్టియు, నిష్కామ = కోరిక లేని, కర్మ = కర్మలును, (కర్మము ఇష్ట మనియును, అపూర్త మనియును రెండు విధములు. అం దిష్టము లనఁగా: శ్లో. 'అగ్నిహోత్రం తపః స్సత్యం వేదానాం చానుపాలనం, ఆతిథ్యం వైశ్వదేవం చ ఇష్ట మి త్యభిధీయతే' = 'అగ్నిహోత్రము చేయుట, జపము నాచరించుట, సత్యము పలుకుట, వేదాధ్యయనము చేయుట, అతిథిపూజ, వైశ్వదేవము అనునవి ఇష్టకర్మలు': శ్లో. 'వాపీకూపతటాకాదిదేవతా యతనాని చ, అన్నప్రదాన మారామః పూర్త మి త్యభిధీయతే.' = 'చెఱువులు బావులు మొదలగువానిని ద్రవ్వించుట, దేవాలయంబులు