పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీ సీతారామాంజనేయసంవాదము

ప్రథమాశ్వాసము.

—♦♦♦♦§§♦♦♦♦—

కథాప్రారంభము.

_____________

—♦♦*§కైలాసపర్వతవర్ణనము.§*♦♦—

అవ. ఈ గ్రంథమున వర్ణింపఁబడుచరిత్ర బ్రహ్మాండపురాణములోని గౌరీ
     శంకర సంవాదము గావున నావిషయమును మొట్టమొదట వర్ణించు
     టకై యీ క్రిందఁ గైలాసపర్వతమును వర్ణించు చున్నాఁడు..


సుఖదశుద్ధసత్త్వా
వాసము శివపార్వతీనివాసము సుమహా
భాస మనాభాసము కై
లాసము తనరారుఁ జిద్విలాసం బగుచున్.39


టీక - శ్రీ సు...సము - శ్రీ = సమృద్ధిగల, సుఖ = ధరార్థకామమోక్షములనియెడు పురుషార్థములనలనఁ గలుగుసుఖమును, (లేక, ఇహలోకమునందును, పరలోకమునందును, పరిపూర్ణ మగునానందమును), ద = ఇచ్చునట్టి, శుద్ధసత్త్వ = పరిశుద్ధ మగుసత్త్వగుణముగల, (రజోగుణమును తమోగుణమునునిడిచి పరిశుద్ధ మగు సత్త్వగుణము నాశ్రయించి యున్న అనుట) మునులకు, ఆవాసము=నివాస మైనదియు, శివ... సము - శివ = శంకరునకును, పార్వతీ = పార్వతీదేవికిని, నివాసము = - ఉనికిపట్టు అయినదియు, సు,..సము - సుమహత్ = మిక్కిలి యధిక మైన, భాసము, (లేక, ఆభాసము) = కాంతిగలదియు, అనాభాసము: తనపై నివసించువారలకుఁ గలదుర్గుణములను నశింపఁజేయునట్టిదియు, (అగు) కైలాసము = కైలాసపర్వతము, చిద్విలాసంబు అగుచున్ = సత్యజ్ఞానానందస్వరూపుఁ డగు పరబ్రహ్మముయొక్క విలాసములవంటి విలాసములు గలది యై, (పరబ్రహ్మమువలెననుట) తనరారున్ = ఒప్పుచుండును (కే (శివయోః) లాసః యస్యసః = శిరస్సునందు (పార్వతీపరమేశ్వరుల) విలాసము గలది కేలాసము. కేలాస ఏవ కైలాసః= కేలాసమే కైలాసము, 'కీలయోః అసనం యస్యసః,