పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

శ్రీ సీతారామాంజనేయసంవాదము


మాని శుద్ధాంతరంగుఁడయి యితర సంకల్పములు లేక బ్రహ్మనిష్ఠ గలిగి యుండుట. సంసక్తినామికయనఁగాఈ నాల్గు భూమికలయభ్యాసమువలన విషయసంగమగుణత్రయ సంగమంబులు లేక బ్రహ్మనిష్ఠయందు పట్టుదప్పక యుండుట, పదార్థభావన యనఁగా, ఈయైదుభూమికల యభ్యాసవిశేషముచేత అంతరబహిర్మధ్యదృశ్యములు లేక స్వాత్మారాముఁడయి బ్రహ్మము నేననుట. తుర్యగ యనఁగా; ఈయాఱుభూమికల మార్గముల నెఱిఁగి యేమిట భేదములేమిఁ దెలిసి పరబ్రహ్మమాత్రముగా నుండుట. దీనిలోమొదటి మూఁడుభూమికలు జగద్వ్యాపారము గలవి గనుక జాగ్రదవస్థయగును. నాల్గవభూమికయందు నామరూపములుగల జగత్ తుస్వప్నమువలె తోఁచును గాన అది స్వప్నావస్థయగును. ఇట్టి యనుభవము గలవాడే బ్రహ్మవిదుఁడు. ఐదవభూమిక నిర్వి కల్పమై సుషుప్తివలె సుఖముగా జగము తోఁచుటవలన అది సుషుప్త్యవస్థయగును. అట్టి యనుభవముగల యోగమే బ్రహ్మావిద్వరుఁడు . ఆఱవభూమిక సర్వవాసనాక్షయ మైనది గనుక గగనమున మునిఁగిన ఘటమువలె బాహ్యాభ్యంతరములులేనిదై సముద్ర మున మునిఁగినకుండవలె లోపల వెలుపల, పరిపూర్ణమై జగము, పరమాత్మ ప్రకాశ ముగాఁ దోఁచుటవలన, అదియే తురీయావస్థ, ఇట్టి అనుభవము గలవాఁడే బ్రహ్మ విద్వరీయుఁడు. ఇదియే జీవన్ముక్తి, సప్తమభూమిక అవాఙ్మానసగోచరము, దానిని బ్రహ్మ విష్ణు రుద్ర జీవ శూన్య కాల ప్రధానాదినామములచే పెక్కండ్రు, పెక్కు గతులఁ బేర్కొందురు. అది నామరూపములు లేనిదైనను కల్పితనామరూపములచేఁ జెప్పఁబడును. ఇట్టి యనుభవముగల యోగియే బ్రహవిద్వరిష్ఠుఁడు; అదియే విదేహ ముక్తి.

వ. సమర్పితంబుగా నొనర్పం బూనిన శ్రీసీతారామాంజనేయసంవాదం
    బను వేదాంతగ్రంథమునకుఁ గథాప్రారంభం బెట్టి దనిన.38

టీక. సమర్పితంబుగాన్ = సమర్పణము చేసి (కృతియిచ్చి), నాయొనర్పం బూనిన = నేను రచించుటకుఁ బూనుకొన్న, శ్రీసీతారామాంజనేయసంవాదం బను వేదాంతగ్రంథంబునకున్ = శోభాయుక్త మగుసీతారామాంజనేయసంవాద మను పేరు గలయద్వైతగ్రంథమునకు, కథాప్రారంభంబు = కథ యొక్క యారంభము, (లేక, క్రమము = గ్రంథమునందలి విషయములు విచారించుట,) ఎట్టిది అనినన్ = ఏవిధమైన దనఁగా.

తా. ఇట్లు గురుపరంపర నభివర్ణించి, పరశురామపంతుల రామయామాత్య పుత్త్రుడగు నేను (లింగమూర్తి గురుమూ ర్తియనువాఁడను) నాగురువగుమహాదేవాచార్యు నకుఁ గృతి యిచ్చి సీతారామాంజనేయసంవాద మను పేరు గల యొక యద్వైత గ్రంథమును రచియింప నుపక్రమించితిని. దానియందలి విషయముల నీ క్రిందఁ క్రమక్రమముగా వివరించెదను.