పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

శ్రీ సీతారామాంజనేయసంవాదము

నాశ్రయించుచు వర్ణాశ్రమధర్మములు, శృంగారము, వైరాగ్యము అనునవియే వేషములుగాఁ గలిగి నామరూపాత్మక మగుసకలప్రపంచమును (ఈ ప్రపంచమునందు పేర్లును రూపములును దప్పఁ బరబ్రహ్మమునకంటె నన్యమగుపదార్థ మేదియును లేదు. ) బుట్టించుచు రక్షించుచు సంహరించుచు, ఎఱుపు నలుపు తెలుపు అనుశరీరచ్ఛాయ గలిగి, కమండలు చక్ర శూలముల ధరించుచు, సత్యలోక వైకుంఠ కైలాసములయందు విలసిల్లువారును, హంసగరుడవృషభవాహనులును, ప్రభావము ధైర్యము మొదలగు సద్గుణములచే నొప్పువారును, సరస్వతీ లక్ష్మీ పార్వతీ నాయకులును, బరబ్రహ్మరూపులును అగు బ్రహ్మవిష్ణుమహేశ్వరుల వినుతించెదను.

అవ. ఇట్లు బ్రహ్మవిష్ణుమహేశ్వకుల నుతించి, వారలయధీనతలోనుండి వారికి సృష్ట్యాదికార్యములు చేయఁ గల సామర్థ్యముల నిచ్చు త్రిగుణశక్తులఁ బ్రార్థించుచున్నాడు.-

శా. బ్రహ్మాండంబు సృజింపఁ బెంప సమయింపం జాలుసామర్థ్యముల్
    బ్రహోపేంద్రనగేంద్రచాపులకు సంపాదించుచు న్వారికిన్
    బ్రహ్మాత్మైక్యవివేక మిచ్చుచును సంభావించుచుం బ్రోచునా
    బ్రాహ్మీమంగళదేవతాగిరిజలం బ్రార్థింతు నశ్రాంతమున్.

టీ. బ్రహ్మాండంబున్ = ప్రపంచమును, సృజింపన్ = సృష్టిఁజేయుటకును, పెంపన్ = వృద్ధిఁ జెందించుటకును, సమయింపన్ = నశింపఁజేయుటకును, చాలు...ముల్ - చాలు = తగిన, సామర్థ్యముల్ = శక్తులను, బ్రహ్మ...చాపులకున్ - బ్రహ్మ = చతుర్ముఖునకును, ఉపేంద్ర = విష్ణువునకును, నగేంద్రచాపులకున్ = శివునకును (త్రిపురసంహారమున రుద్రుఁడు మేరుపర్వతమను ధనుస్సుగా ధరించెనని పురాణగాథ కలదు, దానింబట్టి, నగేంద్రచాపుఁడు = పర్వతము ధనుస్సు గాఁగలవాఁడు, అనుపదము ప్రయోగింపఁబడెను. ), సంపాదించుచున్ = కలుగఁజేయుచు( ఈ త్రిమూర్తులు నిర్వికారులే కావున వీరలకు సృష్ట్యాదికార్యములు చేయు సామర్థ్యము స్వయముగా లేదు. వీరిసాన్నిధ్యమువలన త్రిగుణశక్తులే యీ కార్యములను చేయును. అవి శక్తియుక్తులగు నీ త్రిమూర్తులయం దారోపింపఁబడును అని తెలిసికొనవలయును.), వారికిన్ = ఆత్రిమూర్తులకు, బ్రహ్మాత్మైక్యవివేకమున్ = నిర్గుణపరబ్రహ్మజ్ఞానమును (తామును ఒక్కటియే అను జ్ఞానమును), ఇచ్చుచును సంభావించుచున్ = ఇచ్చి గౌరవించుచు (ఆవిద్య జీవులకు స్వాధీనము కాక వారిని లోఁబఱుచుకొని వారికి బంధములు గలిగించును. ఈగుణశక్తు లట్లుగాక బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు లోఁబడి వారలకు బంధమును గలిగింపకున్నవి యనియు, ఆట్లగుటచే వారలకు బ్రహ్మాత్మైక్యజ్ఞానము దృఢముగా నున్నదనియు భావము.), ప్రోచునాబ్రాహ్మీమంగళదేవతాగిరిజలన్ = రక్షించునట్టియా సరస్వతీలక్ష్మీపార్వ