పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

5

శృంగారరసము, వైరాగ్య = విరక్తి, ఇవియే, వేషులన్ = వేషములుగాఁ గలిగినట్టియు (బ్రహ్మ ధర్మపరుఁడనియు, విష్ణువు శృంగారపరుఁడనియు, ఈశ్వరుఁడు వైరాగ్యపరుఁ డనియు భావము. ), విశ్వ. . .కరులన్ - విశ్వ= ప్రపంచముయొక్క, ఉద్భవ = సృష్టిని, స్థితి = రక్షణము, విలయకరులన్ = ప్రళయమును ఆచరించునట్టియు, తప్త. . .వర్ణులన్ - తప్త = పుటము వేయఁబడిన, కాంచన= సువర్ణముయొక్కయు (కాంతి యొక్క యాధి క్యమును జెప్పుటకై ఇచ్చట "తప్త” అనువిశేషణము వేయఁబడినది. }, నీరధర= మేఘ ముయొక్కయు (నీటితోఁ గూడియున్న మేఘము మిగుల గాంతి గలదై యుండును గావున నిట “నీర” పదము ప్రయోగింపఁబడినది.), చంద్ర = చంద్రునియొక్కయు, వర్ణులన్ = వర్ణమువంటి వర్ణముగలిగినట్టియు (ఇవి క్రమముగా రజస్తమస్సత్త్వగుణముల వర్ణములు కావున త్రిమూర్తులకును ఇవి బాహ్యోపాధులని తెలిసికొనవలయును. బ్రహ్మ కు లోపలను వెలుపలను గూడ రజోగుణమే; విష్ణువునకు లోపల సత్త్వము, వెలుపల తమస్సు; రుద్రునకు లోపలఁ దమస్సు, వెలుపల సత్త్వము ఆవరణము లని యెఱుంగు నది.), శుభకమండలుచక్రశూలధరులన్ = శుభకరము లగు కమండలువు చక్రము శూలము ధరించినట్టియు, ఘనసత్య వైకుంఠకైలాసవాసులన్ = శ్రేష్టము లగు సత్యలోక వైకుంఠ కైలాసములయందు నివసించువారును, పరహంసఖగవృషవాహనులను = శ్రేష్ఠ ములగు హంస గరుడ నందికేశ్వరులు వాహనములుగాఁ గలిగినట్టియు, షడ్గుణైశ్వర్య యుతులన్ = షడ్గుణములసమృద్ధి గలిగినట్టియు (అధికమగుప్రభావము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనునివి షడ్గుణములు .), భాషా ...పతులన్ - భాషావధూ - సరస్వతీదేవికిని, ప్రసన్నమంగళదేవతా = ప్రసన్నురాలగు, లేక, దయయే స్వభావముగాఁగల లక్ష్మీదేవికిని, సర్వమంగళా = పార్వతీదేవికిని, అధిపతులన్ = ప్రభువు లయినట్టియు (గుణత్రయశక్తులను స్వాధీనము గాఁ జేసికొని యుండువా రనుట.), సాక్షాత్ ...మయులన్ - సాక్షాత్ = ప్రత్యక్ష మైన, పరమాత్మమయులన్ = నిర్వికారపరబ్రహ్మమే స్వరూపముగాఁ గలిగినట్టియు ("పరమాత్మ విభాగస్థాః' అను శాస్త్రమును అనుసరించి యీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరమాత్మరూపులే, సృష్ట్యాదియందు గుణములు మూఁడును విజృంభింప నారంభించినపుడు వానిలో ప్రతిబింబించి సర్వవ్యాపకమగు నాపరబ్రహ్మము మూఁడువిధములుగాఁ జెప్పఁబడుచు న్నది అని తెలిసికొనవలయును.), బ్రహ్మవిష్ణుమహేశులన్ , ఇమ్ములన్ = అధికముగా, ప్రస్తుతింతున్ = స్తోత్రము చేయుచున్నాను.

తా. సత్త్వరజస్తమోగుణములు లయము నొందుటకు (ఉత్పత్తి స్థితిలయములు జెందుటకు అని కూడ గ్రహింపవలయును. వస్తువైనను తా నుత్పత్తిఁ జెందిన స్థలము నందె, అనఁగా ఉపాదానకారణమునందె, లయమునొందును గదా!), స్థానమగు చిత్ప్రకృతియే, లేక, మాయయే, దేహములుగాఁ గలిగి రజస్సత్త్వతమోగుణవృత్తుల