పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

శ్రీ సీతారామాంజనేయసంవాదము

ణించి = దయఁజూచి, రక్షించున్ కాతన్ = రక్షించునుగాక (ఆపదలనుండి తొలఁగించును గాక).

తా. గుణసామ్యము (సత్త్వరజస్తమోగుణములు ఎక్కువతక్కువలు లేక సమానములుగా నుండుట.) స్వరూపముగాఁ గలది యగుటచేఁ దనరజస్సత్త్వమో గుణములమూలమున సృష్టిస్థితిసంహారములను జేయుచు శుద్ధసత్త్వస్వరూపముతో బరబ్రహ్మమునందు భేదముగా నిలచి యుండు నాలోకజనని మూలప్రకృతి (మూల ప్రకృతి యగు సీతాదేవి ) కోరినకోర్కుల నొసంగి నన్ను రక్షించుఁ గాక (ఓంకా రమునందు ఆకార ఉకార మకారము లను మూడువర్ణములు కలవు. ఇవి మూఁడును క్రమముగ సత్త్వరజస్తమోగుణము లనియు, మకారము పై నున్న యర్ధమాత్ర గుణ సామ్యస్థితి యనియు, ఇవియన్నియుఁ గలిసి యేర్పడిన "ఓమ్" అనుఅక్షరముప్రకృతి యనియు, ఆయక్షరముయొక్కయర్థము పరబ్రహ్మమనియు ఉపాసింపవలయునని చెప్పఁబడి యున్నది. దీనిచేఁ బ్రకృతికిని బ్రహ్మమునకును గలసంబంధమును బాఠకు లూహింతురు గాక).

అవ. ఇట్లు ప్రకృతిపురుషుల వినుతించి, బ్రహ్మ విష్ణు రుద్రు లనుపేళ్ళతో సత్త్వరజస్తమోగుణములు ఉపాధులు (ఆవరణములు) గాఁ గలిగి విలసిల్లుపరమాత్మ ప్రతిబింబముల వినుతించుచున్నాఁడు.—

సీ. తతశుద్ధసత్త్వప్రధానవిగ్రహుల ని, మ్ముల రజస్సత్త్వతమోగుణకుల
     స్వసుధర్మశృంగారవైరాగ్యవేషుల, విశ్వోద్భవస్థితివిలయకరులఁ
     దప్తకాంచననీరధరచంద్రవర్ణుల, శుభకమండలుచక్రశూలధరుల
     ఘనసత్యవైకుంఠకైలాసవాసుల, వరహంసఖగవృషవాహనులను

తే. షడ్గుణైశ్వర్యయుతుల భాషావధూప్ర, సన్నమంగళదేవతాసర్వమంగ
     ళాధిపతుల సాక్షాత్పరమాత్మమయుల, బ్రహవిష్ణుమహేశులఁ బ్రస్తుతింతు.

టీక. తత... విగ్రహులన్ — తత = వ్యాపించిన, లేక, ప్రసిద్ధ యైన, శుద్ధసత్త్వ ప్రధాన = శుద్ధసత్త్వరూప యగుమాయయే, లేక, ఆ గుణములును లయము నొందు స్థానమైన చిత్ప్రకృతియే, విగ్రహులన్ = శరీరములుగాఁ గలిగినట్టియు (మాయామయము లగుశరీరములు గలవారు, లేక , సర్వమునకు నధిష్టాన మైనప్రకృతితో నభిన్ను లై యుండువారు అని భావము.), రజస్సత్త్వతమోగుణకులన్ = రజోగుణము సత్త్వగుణము తమోగుణము (ఈగుణములకు కార్యము లగుఘోరవృత్తి, శాంతవృత్తి, మూఢవృత్తి) కలిగినట్టియు (ఆవృత్తులవలన క్రమముగా సృష్టిస్థితిసంహారములు జరుగు నని భావము.), స్వ... వేషులన్ — స్వ= స్వకీయ వైన, సుధర్మ = శ్రేష్ఠ మగుధర్మము (వర్ణధర్మములు, ఆశ్రమధర్మములు మొదలగునవి.), శృంగార = వస్త్రభూషణాద్యలంకారములు, లేక,