పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

3

అవ. ఇట్లు తన యిష్టదైవ మగు శ్రీరాముని పరబ్రహ్మరూపునిగా వర్ణించి యీ పద్యమున సీతాదేవిని మూలప్రకృతిరూపముతో నభివర్ణించుచున్నాఁడు.—

సీ. తనరజోగుణముచేఁ దనరంగనే దేవి,గల్పించునఖిలలోకముల నెల్లఁ,
    దనసత్త్వగుణముచే నొనరంగ నేకొమ్మ, పోషించు నీసర్వభూతములను,
    దనతమోగుణముచేఁ దగ నేవధూమణి, జగములనెల్ల సంక్షయముఁ జేయు
    దా శుద్ధసత్త్వప్రధానయై యేరామ, రామాంకమున నజస్రము వసించు

తే. నట్టిభువనైకమాత దయాసమేత, సద్గుణవ్రాత నిర్మలస్వాంతపూత
    భక్తజనమానసోద్యానపారిజాత, సీత కరుణించి నన్ను రక్షించుఁగాత.

టీక. ఏదేవి=మూల ప్రకృతియగు నే సీతాదేవి, తనరజోగుణముచేన్ = తనకుఁ గలరజోగుణము చేత, తనరఁగన్ = ఒప్పునట్లుగా, అఖిలలోకములనెల్లన్ = నానావిధ ము లగుభేదములుగల యీ బ్రహ్మాండముల నెల్లను, కల్పించున్ = సృష్టించునో (ఇచ్చట కల్పించు ననుటచే వాస్తవముగ నీ ప్రపంచము బ్రహ్మమునకంటె వేఱు కాకున్నను వేఱుగానున్నట్లు తోఁపఁజేయుచున్నది యని భావము. ), ఏకొమ్మ= ఏ స్త్రీ, తమసత్త్వ గుణముచే=తనకుఁగల సత్త్వగుణము చేత (శుద్ధసత్త్వమనియు, మలినసత్త్వమనియు సత్త్వగుణము రెండు విధములు, అందు రజస్తమోగుణములతోఁ గొంచె మైనను సం బంధపడనిది శుద్ధసత్త్వము; అట్లు కానిది మలినసత్త్వము. ప్రకృతమున అమలినసత్త్వ మును గూర్చియే చెప్పఁబడియున్నది యని తెలిసికొనవలయును.), తనరంగన్ = ఈ సర్వభూతములను, పోషించున్ , ఏవధూమణి= ఏ నారీరత్నము, తనతమోగుణముచేన్ = తనకుఁగల తమోగుణము చేత, తగన్ =ఒప్పునట్లుగా, జగములనెల్లన్ = లోకములనం తయు, సంక్షయముచేయున్ = నశింపఁజేయునో, ఏరామ = ఏయువతి, తాన్ = తాను, శుద్ధసత్త్వ ప్రధాన + ఐ = శుద్ధసత్త్వమే ప్రధానము గాఁ గలదియై (శుద్ధ సత్త్వస్వ రూపిణి యై యనుట.), రామాంకమునన్ = పర బ్రహ్మస్వరూపుఁడగు శ్రీరామునితొడ పై, ఆజస్రమున్ = సర్వకాలములయందును, వసించున్ = నివసించునో (మాయాశక్తి పరబ్రహ్మమునకు నిత్యానపాయిని; అనఁగా : అగ్నియందున్నయుష్ణశ క్తియునుం బోలె నెప్పుడును పరబ్రహ్మమును విడువకుండునది యని భావము.), అట్టిభువనైకమాత=ఆ లోకజననియు , దయాసమేత = దయగలదియు, సద్గుణవ్రాత = శ్రేష్ఠము లగుగుణసమూ హములు గలదియు, నిర్మలస్వాంత = పవిత్ర మగుహృదయము గలదియు, పూత=నిర్వి కారస్వరూపము గలదియు ( బ్రహ్మము మాయయు నొక్కటియే కావున నిట్లు చెప్పం బడెను.), భక్త... పారిజాత — భక్తజన = భక్తజనులయొక్క మానస = మనస్సులనియెడు, ఉద్యాన = ఉద్యానవనము నందు, పారిజాత = పారిజాతవృక్షమువంటిదియు (తనను ధ్యానించిన వారు కోరినకోర్కుల నొసంగునది యనుట.), అగు, సీత, నన్నున్ , కరు