పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

133


సంసారమునకు ముఖ్యకారణము లగు కామక్రోధములు నశించి జీవునకు బ్రహ్మానందసుఖ ముకలుగును.

ఆవ. ఇట్లు తారక యోగమును బ్రశంసించి దానివలనఁ గలుగుఫలమును విస్త రించి చెప్పుచు దానిని వివరింప నుపక్ర మించుచున్నాఁడు.

వ. అట్లు గావున యోగాభ్యాసంబు ముముక్షువున కవశ్యకర్తవ్యం బట్ల గుట తత్ప్రకారం బెఱింగించెద సావధాన చిత్తుండ నై వినుము. 96

టీ. అట్లుగావునన్ = యోగాభ్యాసము మిగుల నుపయోగకారియగుట చేత, యోగాభ్యాసంబు = రాజయోగాభ్యాసము, ముముక్షువునకున్ = మోక్షేచ్ఛగలవానికి (డు), అవశ్యకర్తవ్యంబు = ముఖ్యముగ చేయవలసినది, అట్లగుటన్ , తత్ప్రకారంబు = ఆరాజయోగాభ్యాసవిధమును (లేక, తారకయోగాభ్యాసవిధమును), ఎఱింగించెదన్ = చెప్పెదను. సావధాన చిత్తుండవై - శ్రద్ధగలవాఁడవై (లేక, ఏకాగ్రచిత్తుఁడవై), వినుము.

తా. ఇట్లు అభివృద్ధికి మిగుల నాధార మగుటచే మోక్షేచ్ఛగలవారందఱు నీ తారకయోగము నభ్యసించి తీరవలయును. కావున దీనిస్వరూపమును వివరించెద వినుము.

యోగాభ్యాసులకు ముఖ్యము లగునాహారాదినియమములు

ఆవ. ఈ క్రింది రెండు పద్యములచే యోగాభ్యాసమునకుఁ దగినయధికారుల నిరూపించుచున్నాఁడు.—

చ. వనరుచు నేమియుం దిననివానికి మిక్కిలి వెక్కసంబుగాఁ
    దిని యెగఁబోయువానికిని దీఱనినిద్దుర యెల్లప్రొద్దుఁ బై
    కొనఁ బడియుండువానికిని గొంకక రేపగ లొక్కరీతి మే
    ల్కొని వసియించువానికి నగోచరము ల్వరయోగలక్ష్యముల్. 97

టీ. వర... ములు - వర = శ్రేష్ఠములగు, యోగ = తారకయోగముయొక్క, లక్ష్య ములు = గురులు, నవరుచున్ = కృచ్ఛ చాంద్రాయణాదులచే శరీరమును శోషింపఁ జేయుచు, ఏమియం దిననివానికిన్ = కొంచెమైనను ఆహారమును తీసికొనని వానికి, మిక్కిలి వెక్కసంబుగాన్ = అధికముగా, తిని, ఎగఁబోయువానికిన్ = నిట్టూర్పులు నిగుడ్చువానికిని, తీఱనినిద్దుర = ఎప్పటికిని ముగియని నిదుర, ఎల్లప్రొద్దున్ = అన్ని కాల ములయందును, పైకొనన్ = క్రమ్ముచుండఁగా, పడియుండువానికిన్ = శయనించియుండు వానికిని, కొంకక = సంశయింపక (లేక, అలయక). రేపగలొక్కరీతిన్ = రాత్రిం బగలొక్కటే విధముగా, మేల్కొని వసియించువానికిన్ = నిదురింపకయే యుండు