పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

శ్రీ సీతారామాంజనేయసంవాదము


వలన (అనఁగా: వేదాంతవాక్యములను విచారించుటవలన), తెగునె = నశించునా! (నశిం పదనుట.)

తా. ఏఫలమైనను కార్యమును నిర్వహించినప్పుడే సిద్ధించును గాని మాటలవలన సిద్ధింపదు. దీపమును వెలిగింపక, “ఈదీపము లిట్టివి ఆదీపమ్ములట్టివి. వాని ప్రకాశము మిగుల నధికమైనది." అని యూరక మాటలు చెప్పుచుండిన చీఁకటి నశించునా? భోజనముఁబెట్టక "ఆ కూరలు మిగుల రుచి గలవి, ఈపిండివంటలు మిగుల మనోహర ములైనవి” అని యాహారపదార్థములను గూర్చి ప్రశంపఁ జేయుచుండిన నాఁకలి తీఱునా? ధనము నొసంగినచో పేదఱికము బోవును గాని అట్లుగాక “ధనమున్న యెడల నెన్నియో మహాకార్యముల సాధింపవచ్చును.” అని ధనముయొక్క మాహా త్మ్యముఁ గొనియాడినమాత్రమున దరిద్రులు ధనవంతులగుదురా? ఔషధములను గూర్చియు వానిశక్తులనుగూర్చియఁ బ్రశంసించిన రోగములు కుదురునా? ఏవియును మాటలవలనఁ గానేరవు. శ్రమ కోర్చి కార్యముల సాధింపపలయును. అనాదినుండియు బుద్ధియందు వ్యాపించి స్థిరమై యే యుపాయముచేతఁ గూడ నశింపని యీయజ్ఞానాం ధకారము గూడ పైఁజెప్పిన మాటలతోఁ దీఱునది కాదు. చిత్ర చిత్రము లగువాద ములతోఁ దీఱునదికాదు. శ్రమ కోర్వవలయును. తారకయోగము నభ్యసింపవల యును. మనసును శబ్దాదివిషయములనుండి మరల్ప వలయును. అపరోక్ష బ్రహ్మజ్ఞాన మును జెందవలయును.

యోగాభ్యాసఫలనిరూపణము

   క. యోగాభ్యాసమువలన స, దాగతిచిత్తేంద్రియములదర్పము లడఁగున్
      రాగద్వేషాదులు చను, బాగుగ నాత్మకు సుఖానుభవముం గలుగున్.

టీ. యోగాభ్యాసమువలనన్ = ఈ రాజయోగము నభ్యసించుటవలన, సదా... ములు - సదాగతి = ప్రాణవాయువు, చిత్త = మనస్సు, ఇంద్రియముల = జ్ఞానేంద్రియకర్మేం ద్రియములయొక్క, దర్పములు = గర్వములు (అనఁగా: విక్షేపమును కలిగించునట్టి స్వభావములు), అడంగున్ = నశించును, రాగ ద్వేషాదులు = కామము క్రోధము మొదలగునవి, చనున్ = పోవును. బాగుగన్ = చక్కఁగా, ఆత్మకున్ = తనకు (లేక జీవునకు), సుఖానుభపమున్ = బ్రహ్మానందానుభవము, కలుగున్

తా. ఈ తారక యోగము నభ్యసించినయెడల మొట్టమొదట ప్రాణవాయువు స్వాధీనమగును. వాయువునకును మనసునకును సంబంధముండుటచేత వాయుజయము తోగూడ మనోజయము కలుగును. ఇంద్రియముల నన్నిటికి మనసే ప్రభువు కావున వెంటనే యింద్రియజయముకూడఁ జేకూరును. ఇట్లన్నియుఁ జయింపఁబడెనేని