పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

131


తా. అపరోక్ష బ్రహ్మానుభవము (నేనే పరబ్రహ్మ మని యనుభఃపూర్వకముగఁ దెలిసికొనుట.) మోక్షమని చెప్పఁబడును. పూనికతో నీరాజయోగమును అభ్యాసముఁ జేయుటకు ప్రాలుమాలి వేదాంతయుక్తులను మాత్రము కొన్నిటిని గూర్చికొని మాటలాడ నేర్చిన వారికందఱకును బ్రహ్మానుభవము (మోక్షము) కలుఁగునా? ఓపికతో ప్రయత్నించి కార్యమును నిర్వహించినయెడల ఫలము కలుగును గాని మాటలతోఁ గలుగునా? కావున నీతారకయోగమును ఆవశ్యముగా నభ్యసింపవల యును.

    సీ. దారుణగాఢాంధ కారం బడంగునే, వసుధపైఁ గృతదీపవార్తవలన
        నాఁకొన్న మనుజునిియాఁకలి దీఱునే, ఘనసరసాన్నవర్ణనమువలన
        నెఱిపేదవానిపేదఱికంబు వోవునే, ద్రవ్యప్రభావకీర్తనమువలన
        రోగపీడితుని బల్ రోగంబు దీఱునే, కలితౌషధ ప్రసంగంబువలన

    తే. జండిపడి బుద్ధిలో వెలి నిండి మిగుల
       దట్ట మైనట్టియజ్ఞానతమము దెగునె
       తర్కితవిచిత్ర శబ్దబోధంబువలన
       ఫలిత యోగానుభవదృష్టివలనఁ గాక. 94

టీక. వసుధపైన్ = భూమిమీఁద, కృత.....లనన్ - కృతి = చేయఁబడిన, దీప = దీపములనుగూర్చిన, వార్తలవలనన్ = ప్రసంగమువలన (అనఁగా దీపవృత్తాంతమును చెప్పఁగానే.) దారు...లు - దారుణ = భయంకరమైన, గాఢ = దట్టమైన, అంధకారంబు = చీఁకటి, అడంగునే = పోవునా? ఘను.....లనన్ - ఘన = శ్రేష్ఠమగు, సరస = రుచిగల, అన్న = అన్నమును, వర్ణనమువలనన్ = వర్ణించుటవలన, ఆకో... కలి - ఆకొన్న = ఆఁకలికొనిన, మనుజుని = మనుష్యుని యొక్క, ఆఁకలి, తీఱునె = పోవునా? ద్రవ్య... లనన్ - ద్రవ్యము = ధనముయొక్క, ప్రభావ=సామర్థ్యమును, కీర్తనమువ లనన్ = చెప్పుటవలన, నెఱి... కంబు - నెఱిపేదవాని = మిక్కిలి బీదయైనవాని, పేదఱికంబు = బీదతనము, పోవునే = పోవునా, కలి...లనన్ - కలిత = ఒప్పుచున్న, ఔషధ = ఔషధముల యొక్క, ప్రసంగంబువలనన్ = వృత్తాంతమువలన ( అనఁగా : ఔషధములను గూర్చి మాట్లాడుట చేత) రోగ .. బు - రోగపీడితుని = రోగముచే బాధపడుచున్న వానియొక్క, బలోగ్రంబు = అధిక మైనరోగము, తీఱునే = పోవునా, జండిపడి = మొండియై, బుద్ధి = బుద్ధియందు, లోన్ = లోపలను, వెలిన్ = వెలుపలను, నిండి = మిగులదట్టమై, ఐనట్టి యజ్ఞానతమము = ఐన యజ్ఞాన మనియెడుచీఁకటి, ఫలి... గాక - ఫలిత = ఒప్పుచున్న, యోగ = రాజయోగము యొక్క, అనుభవము యొక్క (లేక, అనుభవ = అనుభవమువలనఁగలిగినదృష్టివలనఁ గాక జ్ఞానమువలనఁదప్ప), తర్కి.. లనన్ - తర్కిత = విచారింపఁబడిన (లేక, వాదింపఁబడిన ), విచిత్ర = నానావిధములగు, శబ్ద = శబ్దములయొక్క, బోధంబువలనన్ = జ్ఞానము