పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

శ్రీ సీతారామాంజనేయసంవాదము


మును, విదారకమును = ధ్వంపము చేయునది, అంచిత... మును - అంచిత = ఒప్పుచున్న, రాగ= కామమును, రోష = ద్వేషమును, సంహారకమును = పోఁగొట్టునది, ప్రధా ....మును- ప్రధాన = మాయను, పరిహారకమును = ధ్వంసముచేయునదియు, ఆత్మ...మును - ఆత్మ సుఖ = బ్రహ్మానందముయొక్క, అనుభూతి = అనుభపమును, విస్తారకమును = విస్తరింపఁజేయు నది, ఆగ...కమై - ఆగమ = వేదముల యొక్క-, అంతః = కడపటి భాగమగు జ్ఞానకాండ మును, (లేక, ఆచ్చట చెప్పఁబడు బ్రహ్మమును) సువిచారకమై = బాగుగ విచారించు నదియై; తనరారున్ = ఒప్పుచుండును.

తా. ఓఆంజనేయా! ఈతారకయోగము సంసారసముద్రమును తరింపఁజేయు నది. సకలపాపములను ధ్వంసముఁ జేయునది. బ్రహ్మ విష్ణువు మొదలగు సకల దేవతల చేతను గొనియాడఁ బడునది. అజ్ఞానము హరించి రాగద్వేషముల నడంచి యాత్మజ్ఞాన మును విస్తరింపఁ జేయునది. ఆతిసూక్ష్యమగువేదాంతార్థమును కరతలామలకముఁజేయు నది.


తే. తారకయోగము దెలియఁగ, నేరక వేదాంతవాక్యనికురుంబముచే
    నూరక వాదించుచుఁజెడు, వారికి మోక్షంబు గలదె వాయుకుమారా!8


టీ. వాయుకుమారా = ఆంజనేయా! తారకయోగమున్ = తారకయోగము, తెలి యఁగనేరక = తెలిసికొనలేక, వేదాం... ముచేన్ -వేదాంతవాక్య = వేదాంతవాక్యము లయొక్క, నికురుంబముచేన్ = సమూహము చేత, ఊరక = నిరర్థకముగా, వాదించుచున్ = వాదముచేయుచు, చెడువారికిన్ = చెడిపోవుచున్నవారికి, మోక్షంబు గలదె = ముక్తి యున్నదా?

తా. ఓవాయుపుత్త్రా  ! ఇట్లు తారకయోగము మహోపకారముఁ జేయునదియై యుండ దీనిని తెలిసికొని యధ్యసింపలేక ఊరక కొన్ని వేదాంతవాక్యముల నేర్చు కొని వాదములఁ జేయుచుండిన మోక్షము దొరకునా ?


తే. రాజయోగంబుఁ బూని నిరంతరంబు
    పట్టుగా నభ్యసింపంగఁ బ్రాలుమాలి
    కొన్ని వేదాంతయుక్తులు గూడఁ బెట్టి
    పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదె?9


టీక, రాజయోగంబు = రాజయోగమును పూని = ఆవలంబించి నిరంతరంబు = ఎల్లప్పుడును, పట్టుగాన్ = ఉత్సాహముతో, అభ్యసింపంగన్ = అలవాటుచేయుటకు ప్రాలుమాలి. కొన్ని వేదాంతయుక్తులు, కూడఁబెట్టి, పలుకనేర్చినన్ = నిరర్థకముగా వాముసేయుటకు, తెలిసినంతమాత్రముననే, బ్రహ్మానుభవము కలదె!